SUVs under Rs 10 lakh: 30 KM మైలేజీ, అదిరిపోయే ఫీచర్లతో రానున్న 5 SUVలు, ధర 10 లక్షలలోపే...
SUVs under Rs 10 lakh:2025లో 10 లక్షల కంటే తక్కువ ధరలో మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్, టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వంటి 5 కొత్త SUVs భారతదేశంలో విడుదల కానున్నాయి. వీటి ప్రత్యేకతలు తెలుసుకుందాం.

SUVs in India coming under Rs 10 lakh: భారతీయ కార్ మార్కెట్లో చవకైన SUV లకు అపారమైన డిమాండ్ ఉంది. అందుకే దీన్ని అవకాశంగా తీసుకుంటున్నాయి కార్ల కంపెనీలు. దేశంలోని పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు 2025లో కొత్త వెహికల్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఐదు కొత్త SUV లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఈ అన్ని మోడళ్ల ప్రారంభ ధర 10 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటుంది. ఇవి ప్రత్యేకంగా బడ్జెట్ సెగ్మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్టు తెలుస్తోంది.
ఇందులో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ , అప్‌డేట్ చేసిన పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లు కూడా ఉంటాయి. ఈ జాబితాలో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా , రెనోల్ట్ కార్లు ఉన్నాయి.
1. మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్
మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్‌ను 10 లక్షల రూపాయల కంటే తక్కువ ఎక్స్-షోరూమ్ ధరతో తీసుకురానుంది. ఇందులో కొత్త 1.2-లీటర్ Z12E పెట్రోల్ ఇంజిన్ హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తుంది, దీని అంచనా ఇంధన సామర్థ్యం 30 KMPL కంటే ఎక్కువగా ఉండవచ్చు. ఈ SUV 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో ఉండబోతోంది. ఈ ఏడాది చివరిలో ఈ కారును తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే పవర్‌ట్రైన్ భవిష్యత్తులో బలెనో , డిజైర్‌లో కూడా కనిపించవచ్చు.
2. 2025 హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ వెన్యూ కొత్త తరం మోడల్ 2025 చివరి నాటికి మార్కెట్లోకి రావచ్చు. దీని ప్రారంభ ధర 10 లక్షల రూపాయల కంటే తక్కువగానే ఉంటుంది. డిజైన్ , ఇంటీరియర్ అప్‌డేట్‌లు హ్యుందాయ్ క్రెటా, అల్కాజర్ నుంచి ప్రేరణగా తీసుకొని డిజైన్ చేశారు. ఇంజిన్ ఎంపికలలో 1.2L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0L టర్బో పెట్రోల్ , 1.5L డీజిల్ ఉంటాయి. ఇందులో స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS వంటి అధునాతన ఫీచర్లు ఉండవచ్చు.
3. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను సంవత్సరం చివరిలో తీసుకొస్తున్నారు. దీని ధర 10 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటుంది. ఈ SUV నెక్సాన్ , కర్వ్ వంటి టాటా ఇతర కార్ల నుంచి ప్రేరణతో కొత్త డిజైన్‌తో వస్తుంది. ఇందులో 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 86hp శక్తి , 113Nm టార్క్ ఇస్తుంది. ఈ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్, AMT, CNG ఎంపికలతో రావచ్చు. ఇందులో స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కొత్త ఫీచర్లు కూడా జోడించబడవచ్చు.
4. మహీంద్రా XUV 3XO EV
టాటా నెక్సాన్ EV, సిట్రోయెన్ eC3 లకు పోటీగా మహీంద్రా XUV 3XO EVని తీసుకురానున్నారు. ఈ ఎంట్రీ-లెవెల్ ఎలక్ట్రిక్ SUV ఒకసారి ఛార్జ్ చేస్తే 400 నుంచి 450 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదు. దీన్ని XUV400 కంటే తక్కువగా ఉంచవచ్చు. తద్వారా ఇది మరింత చవకైన ఎంపికగా మారుతుంది.
5. రెనోల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్
రెనోల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ త్వరలోనే భారతీయ మార్కెట్లోకి అడుగుపెడుతుంది. దీన్ని ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, ఫీచర్లలో పెద్ద అప్‌డేట్‌లతో ప్రవేశపెట్టనున్నారు. అయితే దీని ఇంజిన్ సెటప్ మునుపటిలాగే ఉంటుంది, ఇందులో 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో, భవిష్యత్తులో ఈ మోడల్‌లో CNG వేరియంట్ కూడా రావచ్చు.





















