అన్వేషించండి

Mahindra Thar Roxx: 50-60 వేలు సంపాదించేవాళ్లు థార్ రాక్స్‌ను ఈజీగా ఇంటికి తీసుకెళ్లొచ్చు, EMI ఇంతే!

Mahindra Thar Roxx On EMI: మహీంద్రా థార్ రాక్స్ బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ధర దాదాపు రూ.15.4 లక్షలు. రేటు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, పక్కా ప్లాన్‌తో దీనిని పట్టేయవచ్చు.

Thar Roxx Bank Loan And EMI Details: డ్రైవింగ్‌ చేయడమే కాదు, దానిని ఎంజాయ్‌ చేయడం కూడా ఒక కళ. చాలా మంది, లాంగ్‌ డ్రైవ్‌లతో థ్రిల్‌ ఫీలవుతారు & రీఛార్జ్‌ అవుతారు. మహీంద్ర & మహీంద్ర బ్రాండ్‌ లాంచ్‌ చేసిన థార్ రాక్స్‌ కూడా అలాంటి గొప్ప అనుభూతిని అందించే ఆఫ్-రోడింగ్ SUV. ముఖ్యంగా, యువత ఈ బండంటే వెర్రెత్తిపోతోంది. గత సంవత్సరం, మహీంద్ర కొత్త 5-డోర్ల థార్‌ రాక్స్‌ను మార్కెట్‌లోకి వదిలింది. మునుపటి కంటే మరింత పవర్‌తో, మరింత ఆకర్షణీయంగా దానిని డిజైన్‌ చేసింది.

మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ ధర కాస్త ఎక్కువే. దీనిని సొంతం చేసుకోవాలనే కోరిక ఉన్నా, రేటును చూసి సగటు మనిషి భయపడుతున్నాడు. మీకు కూడా ఈ బండిపై మోజు ఉండి, తక్కువ బడ్జెట్ కారణంగా కొనలేకపోతున్నారా?. అయితే, సరైన ఫైనాన్స్ ప్లాన్ ఉంటే, మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్‌ ఆఫ్-రోడింగ్ SUVని తీసుకెళ్లి మీ ఇంటి ముందు పార్క్‌ చేసుకోవచ్చు. ఈ SUVని కొనడాని ఎలాంటి ప్లాన్‌ ఉండాలో ఇప్పుడు చూద్దాం.

మహీంద్రా థార్ రాక్స్ డౌన్ పేమెంట్ & లోన్‌
దిల్లీలో, మహీంద్రా థార్ రాక్స్ బేస్ వేరియంట్ MX 1 రియర్ వీల్ డ్రైవ్ (పెట్రోల్) మోడల్ ఆన్ రోడ్ ప్రైస్‌ దాదాపు 15 లక్షల 40 వేల రూపాయలు. మీ దగ్గర ఇప్పుడు రూ.2 లక్షలు ఉంటే చాలు. ఈ SUV ని కొనడానికి ఆ రూ. 2 లక్షలను డౌన్ పేమెంట్ చేసేయండి, మిగిలిన 13 లక్షల 40 వేల రూపాయలను బ్యాంక్‌ నుంచి కార్‌ లోన్‌గా తీసుకోండి. బ్యాంక్‌ మీకు 9 శాతం వడ్డీ రేటుతో ఈ లోన్‌ మంజూరు చేసిందని భావిద్దాం. మీ జీతం లేదా నెలవారీ ఆదాయం కనీసం రూ. 50 వేల నుంచి 60 వేలు ఉంటే, కార్‌ లోన్‌ EMI చెల్లించడం మీకు సులభం అవుతుంది. 

మహీంద్రా థార్ రాక్స్ లోన్‌ EMI లెక్కలు (9 శాతం వడ్డీ రేటు)

  • 5 సంవత్సరాల కాలానికి రూ.13.4 లక్షల రుణం తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 27,816 అవుతుంది. ఐదేళ్ల కాలంలో (60 నెలలు) కట్టే మొత్తం వడ్డీ రూ. 3,28,972 తో కలిపి మొత్తం రూ. 16,68,972 బ్యాంక్‌కు తిరిగి చెల్లించాలి.
  • 6 సంవత్సరాల కాలానికి అదే మొత్తం లోన్‌ తీసుకుంటే, EMI రూపంలో ప్రతి నెలా రూ. 24,154 చెల్లించాలి. ఆరేళ్ల (72 నెలలు) కాలంలో కట్టే మొత్తం వడ్డీ రూ. 3,99,104 తో కలిపి మొత్తం రూ. 17,39,104 రీపేమెంట్‌ చేయాలి. 
  • 7 సంవత్సరాల కాలానికి రూ.13.4 లక్షల రుణం తీసుకుంటే, మంత్లీ EMI రూ. 21,559 అవుతుంది. ఏడేళ్ల (84 నెలలు) కాలంలో కట్టే మొత్తం వడ్డీ రూ. 4,70,987 తో కలిపి మొత్తం రూ. 18,10,987 బ్యాంక్‌కు తిరిగి చెల్లించాలి.
  • మీకు స్థోమత ఉండి 4 సంవత్సరాలలోనే లోన్‌ తీర్చేలా ప్లాన్‌ చేసుకుంటే, రూ.13.4 లక్షల లోన్‌పై 9 శాతం వడ్డీ చొప్పున, నెలకు రూ. 33,346 EMI చెల్లించాలి. ఈ 48 నెలల్లో 2,60,606 వడ్డీతో కలిపి మొత్తం రూ. 16,00,606 చెల్లించాలి.

మహీంద్రా థార్ రాక్స్‌ మైలేజీ
కంపెనీ చెప్పిన ప్రకారం, మహీంద్రా థార్ రాక్స్ దాదాపు 15 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. కాబట్టి, మీరు ఇంధనం కోసం కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఖర్చు మీ మొత్తం వ్యయాన్ని పెంచుతుంది. కాబట్టి, ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం. 

మహీంద్రా థార్ రాక్స్ డిజైన్ & ఫీచర్లు
మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ SUV రెండు శక్తిమంతమైన ఇంజన్‌ ఆప్షన్లతో వచ్చింది, అవి... 2.0-లీటర్ 4-సిలిండర్ mStallion టర్బో పెట్రోల్ ఇంజిన్ & 2-లీటర్ 4-సిలిండర్ mHawk డీజిల్ ఇంజిన్. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆపన్స్‌ కూడా దీనిలో ఉన్నాయి.

మహీంద్రా థార్ రాక్స్ కలర్‌ ఆప్షన్స్‌
కొత్త మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్‌ SUV టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, ఫారెస్ట్ గ్రీన్ & నెబ్యులా బ్లూ వంటి ఆకర్షణీయమైన రంగులలో లాంచ్‌ అయింది. ఇది 3-డోర్‌ 'థార్' కంటే కొంచెం పొడవుగా ఉంది & ఈ బండిలో ఐదుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget