Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
Usha Sri Charan: పెనుగొండ నియోజకవర్గ ఇంచార్జ్ గా వచ్చేందుకు మళ్లీ శంకర్ నారాయణ ప్రయత్నిస్తున్నారు. ఉషాశ్రీచరణ్ పరిస్థితి గందరగోళంగా మారింది.

Penugonda YSRCP: అనంతపురం ఉమ్మడి జిల్లాలో పెనుగొండ తెలుగుదేశం పార్టీకి అత్యంత పట్టున్న నియోజకవర్గం. అలాంటి చోట 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం లోనే పెనుకొండ లో కూడా మొట్టమొదటి సారి వైసిపి బోణీ కొట్టింది. దీంతో సరాసరి పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయనకీ సైతం జగన్ రెడ్డి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే జరిగింది. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందన్న చందంగా జగన్ రెడ్డి చేసిన ప్రయోగం బెడిసికొట్టింది.
బీసీ కంచు కోట పెనుకొండ
అనంతరం 2024 ఎన్నికల్లో శంకర్ నారాయణ కాదని అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్‌నుకు చాన్స్ ఇచ్చారు. పెనుగొండ నియోజకవర్గం బీసీకి ( కురుబ ) కంచుకోట అలాంటి నియోజకవర్గంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తూ వచ్చింది. వైయస్ ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నంటే ఉంటూ వస్తున్న కృప శంకర్ నారాయణ కు 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి జగన్ బరిలో నిలిపాడు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి కే పార్థసారధి పై శంకర్ నారాయణ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అనంతరం శంకర్ నారాయణ కు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవిని కూడా కేటాయించారు. 2024 ఎన్నికల్లో శంకర్ నారాయణ ను అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దింపి అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ను పెనుగొండ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ ఆమె పరాజయం పాలయ్యారు.
పార్టీ ఇన్చార్జి ను మారుస్తున్నారా..?
2024 ఎన్నికల ఓటమి అనంతరం వైయస్సార్సీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. బలమైన అభ్యర్థి శంకర్ నారాయణ కాదని ఉషాశ్రీ చరణ్ కు టికెట్ కేటాయించినప్పటి నుంచి కూడా పెనుగొండ నియోజకవర్గం లో వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నియోజకవర్గ ఇన్చార్జిను మార్చాలన్న ప్రతిపాదన జగన్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఉషశ్రీ చరణ్ శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షురాలుగా కూడా కొనసాగుతున్నారు. పెనుగొండ నుంచి పరిటాల రవీంద్ర మూడు సార్లు వరుసగా విజయం సాధించారు. ఆయన హత్య తర్వాత రవి భార్య పరిటాల సునీత ఒక్కసారి పెనుగొండ నుంచి గెలుపొందారు. మొత్తంగా ఇప్పటివరకు 8 సార్లు పెనుగొండ నుంచి టీడిపి విజయం సాధించింది. ఉషాశ్రీచరణ్‌ను పెనుగొండకు మార్చిన జగన్ 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి శంకర నారాయణ వైసీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శంకరనారాయణ.. తిరిగి పెనుకొండ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ పదవి ఆశిస్తూ పావులు కదుపుతున్నారg. మండల స్థాయిలో తన వర్గీయులతో సమావేశాలు పెట్టి మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారంట. పార్టీ అధ్యక్షుడు జగన్, ఇతర పార్టీ పెద్దల వద్దకు వెళ్లి నియోకవర్గ ఇన్చార్జ్ పదవి శంకర్ నారాయణకే ఇవ్వాలని పెనుగొండ సెగ్మెంట్ పరిధిలోని మండలాల నేతలు వత్తిడి తెస్తున్నారు.
శంకర్ నారాయణ వర్గీయుల్ని సస్పెండ్ చేయించిన ఉషాశ్రీచరణ్
ఉష శ్రీ చరణ్ హైకమాండ్ దగ్గర తన పలుకుబడిని ఉపయోగించి పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ శంకరనారాయణ వర్గీయుల్ని కొందర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. దాంతో పెనుగొండలో వారద్దరి మధ్య పరిస్థితి ఉప్పునిప్పులా తయారైందంటున్నారు . ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం వారిద్దరు అలా కుస్తీ పడుతుంటే.. ఇటీవల వారిద్దరికి పోటీగా మూడో వ్యక్తి సీన్లోకి వచ్చి ఇన్చార్జ్ పదవి కోసం పోటీ పడుతున్నారంట. ఉషాశ్రీ, శంకరనారాయణలను పెనుగొండ వైసీపీలో సైడ్ చేయడానికి శిల్పా అనే కొత్త నాయకురాలు ప్రయత్నిస్తున్నారనీ టాక్ నడుస్తోంది. ఇప్పటికే పెనుగొండ లో ఇద్దరు మాజీ మంత్రులు శంకర్ నారాయణ , ఉష శ్రీ చరణ్ లు రెండు వర్గాలుగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇన్చార్జ్‌గా ఉష శ్రీ చరణ్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారని పార్టీ క్యాడర్ ఆరోపణలు గుప్పిస్తోంది.. ఈ క్రమంలో పెనుగొండ నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలను పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిష్కారం చూపుతాడో వేచి చూడాల్సి ఉంది.





















