అన్వేషించండి

Honda Activa 110 కొనడానికి 3 పక్కా కారణాలు… దూరంగా ఉండాల్సిన 2 మైనస్ పాయింట్లు

Honda Activa 110 ఇప్పటికీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్. దీనిలో 3 బలమైన ప్లస్ పాయింట్లు, 2 స్పష్టమైన మైనస్ పాయింట్లు ఉన్నాయి.

Honda Activa 110 Review Telugu: భారతదేశంలో స్కూటర్ మార్కెట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు హోండా యాక్టివా. దాదాపు రెండు దశాబ్దాలుగా, బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా తన స్థానాన్ని ఎవ్వరూ కదలించలేని స్థాయిలో నిలబెట్టుకుంది. కాలక్రమేణా పెద్ద మార్పులు రాకపోయినా, Activa 110 ఇప్పటికీ చాలా మందికి నమ్మకమైన, ఆచరణీయమైన ఎంపికగానే ఉంది. అయితే ఈ స్కూటర్‌లో అనుకూలతలు, ప్రతికూలతలు రెండూ ఉన్నాయి. ఈ బండి ఎవరికి సూటవుతుంది, ఏ సందర్భాల్లో ఇతర ఆప్షన్లను చూడాలి అనేది ఈ రివ్యూలో మీకు అర్ధమవుతుంది.

Honda Activa 110 కొనడానికి 3 ప్రధాన కారణాలు

1. స్మూత్ ఇంజిన్ & అద్భుతమైన మైలేజ్
హోండా ఇంజిన్లు రిఫైన్‌మెంట్‌ విషయంలో ఎప్పటి నుంచో బెస్ట్. Activa 110 కూడా అదే తరహా స్మూత్ పెర్ఫార్మెన్స్‌తో నడుస్తుంది. దీని లాంగ్-స్ట్రోక్ ఇంజిన్ వేగంగా నడిపినా, నెమ్మదిగా నడిపినా పెద్దగా వైబ్రేషన్ లేకుండా పని చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, Activa లీటరుకు 60 km వరకు మైలేజ్ ఇస్తుంది. రోజువారీ ప్రయాణాలు, పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ప్లస్ పాయింట్.

2. డైలీ యూజ్‌కు కావాల్సిన కంఫర్ట్ & కన్వీనియెంట్‌ ఫీచర్లు
స్కూటర్ తీసుకునే ప్రధాన కారణం ‘కన్వీనియన్స్’. ఈ విషయంలో Activa 110 తన ప్రాక్టికల్ ఫీచర్లతో ముందు వరుసలో ఉంటుంది. కీ లెస్ ఫంక్షన్ అందించడం వల్ల, ఫాబ్ జేబులో ఉండగానే, మీరు కేవలం నాబ్ తిప్పితే చాలు - లాక్/అన్‌లాక్, స్టార్ట్/ఆఫ్ అన్నీ అవుతాయి. అదే విధంగా, స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా ఇంధనాన్ని ఆదా చేయడంలో సాయపడుతుంది. సిగ్నల్ వద్ద ఇంజిన్ ఆగిన తర్వాత ఆక్సిటేటర్‌ తిప్పగానే మళ్లీ స్టార్ట్ అవుతుంది, చాలా సౌకర్యంగా ఉంటుంది.

3. నమ్మదగిన విశ్వసనీయత & తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు
ఆక్టివా రెండు దశాబ్దాలుగా బెస్ట్ సెల్లర్ కావడానికి ప్రధాన కారణం - నమ్మకమైన క్వాలిటీ. ఇది, మామూలు స్కూటర్ కంటే ఎక్కువ కాలం సమస్యలు లేని బండిగా వాడుకునే అవకాశం ఇస్తుంది. హోండా సర్వీస్ ఖర్చులు కూడా ఇతర బ్రాండ్‌లతో పోలిస్తే తక్కువే. దీంతో దీర్ఘకాలం ఉపయోగించాలనుకునే వారికి Activa 110 మంచి ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించవచ్చు.

Honda Activa 110 కొనకూడని 2 కారణాలు

1. చిన్న అండర్‌సీట్ స్టోరేజ్ - ఈ రోజుల అవసరాలకు సరిపోదు
నేటి తరం స్కూటర్లలో స్టోరేజ్‌ స్పేస్‌ చాలా ముఖ్యం. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లలో 35 లీటర్లకు పైగా స్టోరేజ్ ఇస్తున్నారు. కానీ Activa 110లో మాత్రం కేవలం 18 లీటర్ల స్టోరేజ్ మాత్రమే ఉంది. హెల్మెట్ పెట్టాలనుకున్నా, రోజువారీ వస్తువులు వేసుకోవాలనుకున్నా ఈ స్పేస్‌ చాలా పరిమితంగా ఉంటుంది. ఇది పెద్ద మైనస్ పాయింట్.

2. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లేకపోవడం మరో పెద్ద లోపం
టాప్ H-Smart వేరియంట్‌లో TFT డిస్‌ప్లే, కీ లెస్ స్టార్ట్, స్టార్ట్/స్టాప్ టెక్ ఉన్నప్పటికీ... ఇప్పటికి కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. డ్రమ్ బ్రేక్ పని చేస్తుంది, కానీ... బ్రేక్‌ ఫీల్‌ పరంగా, బ్రేకింగ్‌ పెర్ఫార్మెన్స్‌ పరంగా డిస్క్ బ్రేక్‌తో పోలిస్తే స్పష్టంగా తేలిపోతుంది. 

సింప్లిసిటీ, మైలేజీ, నమ్మకం - ఈ మూడు విలువలను ప్రాధాన్యంగా చూసేవారికి Honda Activa 110 ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్‌. అయితే... పెద్ద స్టోరేజ్, డిస్క్ బ్రేక్ వంటి ఆధునిక ఫీచర్లు కోరుకునే వాళ్లయితే మార్కెట్‌లోని ఇతర మోడళ్లను పరిశీలించడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Renault Duster, Kiger, Triber, Kwid కార్లపై రూ.2.10 లక్షల వరకు డిస్కౌంట్లు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?
రెనాల్ట్‌ డస్టర్‌ మీద రూ.2.10 లక్షలు, క్విడ్‌ మీద రూ.40,000 వరకు తగ్గింపు.. ఇంకొన్ని రోజులే!
Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే
కారు ఇంజిన్‌లో ఈ 3 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లండి
Engine Warm Up: పెట్రోల్, డీజిల్, CNG కార్లను నడిపే ముందు ఎంత సేపు ఆన్‌లో ఉంచాలి? కంపెనీలు ఏం చెబుతున్నాయి?
చలికాలంలో కారును స్టార్ట్ చేసిన వెంటనే డ్రైవ్ చేయొచ్చా? ఇంజిన్‌ వేడెక్కేవరకు వెయిట్‌ చేయాలా?
Electric Scooter Sales: జనం ఎక్కువగా కొంటున్నది ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లనే.. అక్టోబర్‌లో రెట్టింపు అమ్మకాలు!
ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొంటారా? ప్రస్తుతం దేశంలో నంబర్‌ 1, నంబర్‌ 2 కంపెనీలు ఇవే!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Tragedy Story: బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
MPP ZP Schedule: ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
This Week OTT Web Series : ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
Pawan Anna Konidela Divorce : పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
Mahesh Kumar Goud: భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
Cashews For Health : జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
Gill, Iyer Swap: వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
Embed widget