అన్వేషించండి

Ganta Vs Vishnu: ఫిల్మ్ నగర్ క్లబ్ లీజుపై వివాదం - గంటా, విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదం

Vizag: విశాఖ కూటమి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫిల్మ్ నగర్ కల్చర్ క్లబ్ లీజ్ విషయంలో ఇది జరిగింది.

Vizag Film Nagar Club Issue: విశాఖ సిటీలో కూటమి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవల ఫిలింనగర్ క్లబ్ లీజ్ విషయంలో విష్ణుకుమార్ రాజు కలెక్టర్ కు లేఖ రాశారు. అయితే ఆ వ్యవహారం  ది భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని.. తనకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్లారని అంటూ విష్ణు కుమార్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.   ఈ లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికీ తీసుకెల్లే సమయంలో మీరు అందుబాటులో లేరని.. గంటా శ్రీనివాస్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు  విష్ణు కుమార్. 

శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో  గంటా శ్రీనివాసరావు,  విష్ణుకుమార్ రాజు  పాల్గొన్నారు. ఆ సమయంలో    గంటా కారులో కూర్చొని సీరియస్ గా మాట్లాడుతుంటే.. విష్ణు కుమార్ రాజు కారు పక్కనే నిలబడి సమాధానం చెబుతూ ఉన్నారు. ఈ తతంగాన్ని మీడియా వీడియోలు తీసింది. గంటా శ్రీనివాసరావు మాత్రం వినకుండా కేకలు వేస్తూ వాహనంలో కూర్చొని మరింత ఆగ్రహంతో స్పందించారు. ఈ క్రమంలో తోటి నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. గంటా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

2014లో  విశాఖ ఫిల్మ్   క్లబ్ ను ఏర్పాటు చేశారు.   సినిమా ,  సాంస్కృతిక కార్యకలాపాల ప్రభుత్వం నుండి భూమిని లీజుకు  తీసుకుంది.  ఈ భూమి విలువైన బీచ్ రోడ్డు ప్రాంతంలో ఉండటం వల్ల, దీనిపై రాజకీయ నాయకులు ,  వివిధ గ్రూపుల దృష్టి పడింది. వైఎస్ఆర్‌సీపీ హయాంలో క్లబ్ పాలకవర్గం మారిపోయింది. విజయసాయిరెడ్డి కనుసన్నల్లో ఈ వ్యవహారాలు నడిచాయని చెబుతారు.  2024 జూన్‌లో, క్లబ్‌లోని "వైఎస్ఆర్ లాన్స్" అనే పేరును క్లబ్ సభ్యులు తొలగించారు. గత వైసీపీ ప్రభుత్వం క్లబ్‌పై ఒత్తిడి చేసి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేరుతో బోర్డు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ చర్యను క్లబ్ సభ్యులు వ్యతిరేకించారు,   వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత, ఈ పేరును తొలగించారు.

ఈ క్లబ్ లీజు వ్యవహారంలో ఏం జరిగిందో కానీ గంటా శ్రీనివాసరావు  మాత్రం..  విష్ణుకుమార్ రాజు జోక్యాన్ని సహించలేదు. ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.  ఆ క్లబ్ భీమిలి నియోజవర్గంలోకి రావడమే కాదు ఆ క్లబ్ ఏర్పాటులో గంటా శ్రీనివాసరావు కూడా కీలక పాత్ప పోషించారు. విష్ణుకుమార్ రాజు క్షమాపణలు చెప్పినందున .. ఈ వ్యవహారంలో ఇంతటితో సద్దుమణిగిపోయి ఉంటుందని  భావిస్తున్నారు.          

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Embed widget