అన్వేషించండి

Butta Renuka : బుట్టా రేణుక ఆర్థికంగా చితికిపోయారా ? రాజకీయాలే కారణమా ?

Ysrcp Leader: బుట్టా రేణుక ఆస్తులను ఎల్ఐసీ వేలం వేస్తోంది. రూ. 340 కోట్లకుపైగా రుణాలు తీసుకుని చెల్లించకపోవడమే కారణం.

Ysrcp Leader Butta Renuka assets auction: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ బుట్టా రేణుకకు చెందిన ఖరీదైన ఆస్తులను ఎల్ఐసీ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ వేలం వేస్తోంది. రూ. 310 కోట్ల రూపాయలు రుణం తీసుకుని చెల్లించడం మానేశారు. నెల వాయిదాలు కూడా చెల్లించడం లేదు. దీంతో గతంలోనే ఆమె ఆస్తులను వేలం వేసే ప్రక్రియను ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ ప్రారంభించింది. బంజారాహిల్స్ లో ఉన్న ఐదు వేల గజాల స్థలం, మాదాపూర్ లో ఉన్న బుట్టా కన్వెన్షన్  సెంటర్ ను వేలానికి పెట్టింది. గతంలో వేలానికి పెట్టినా తర్వాత ఇబ్బందులు వస్తాయని ఎవరూ రాకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు ఆమె ప్రజాప్రతినిధి కాకపోవడంతో పాటు వైసీపీ కూడా ఏపీలో అధికారంలో లేదు. అందుకే తమకు రావాల్సిన రూ.340 కోట్ల రూపాయలను బంజారాహిల్స్ లోని ఐదు చదరపు గజాలను, మాదాపూర్ లోని బుట్టా కన్వెన్షన్ సెంటర్ ను అమ్మకానికి పెట్టి రికవరీ చేసుకోవాలని ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ నిర్ణయం తీసుకుంది.  బుట్టా రేణుక కుటుంబానికి  స్కూళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, కార్ డీలర్ షిప్‌లు ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయి.   

బుట్టా రేణుక వెైఎస్ఆర్‌సీపీ నుంచి  రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో ఆమె వైసీపీ తరపు నుంచి  కర్నూలు లోక్ సభకు ఎంపికయ్యారు. అయితే ప్రభుత్వంలోకి టీడీపీ రావడంతో ఆమె చంద్రబాబును కలిశారు.  బుట్టా రేణుక భర్త టీడీపీ కండువా కప్పుకున్నారు. బుట్టా రేణుక మాత్రం అనర్హతా వేటు పడుతుందన్న  కారణంగా టీడీపీలో చేరలేదు. కొన్ని రోజులకు మళ్లీ టీడీపీకి  దూరయ్యారు. ఎన్నికలకు ముందు అధికారికంగా మళ్లీ వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లభించలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోనే కొనసాగారు. కానీ ఎలాంటి పదవులు లభించలేదు. 2024 ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టిక్కెట్ ను ఆశించారు. 

అయితే సీఎం జగన్ మాత్రం ఆమెకు ఎమ్మిగనూరు టిక్కెట్ కేటాయించారు. ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ నిరాకరించి బుట్టా రేణుకకు సీటు కేటాయించారు. అయితే కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్‌సీపీ తుడిచి పెట్టుకుపోయింది. ఎమ్మిగనూరులోనూ ఓడిపోయింది. ఎన్నికల ప్రచార సభల్లో జగన్ అభ్యర్థులను పరిచయం చేసేటప్పుడు బుట్టా రేణుకను సౌమ్యురాలు.. డబ్బులు కూడా అంతంతమాత్రమే అని పరిచయం చేశారు. అయితే తనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని బుట్టా రేణుక యూట్యూబ్ ఇంటర్యూల్లో చెప్పిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. బుట్టా రేణుకను ట్రోల్ చేశారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలోనే  ాస్తుల వేలం ప్రకటన వచ్చింది. 

తమ ఆస్తుల వేలంపై బుట్టా రేణుక కుటుంబం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. డిఫాల్ట్ అయినందున.. వారు ఆస్తుల్ని అమ్ముకుని రికవరీ చేసుకోవచ్చని వదిలేసినట్లుగా చెబుతున్నారు. బుట్టా రేణుక విజయవంతమైన వ్యాపారవేత్త అని.. రాజకీయాల్లోకి వచ్చి ఆమె నష్టపోయారని ఆమె అనుచరులు అంటున్నారు.                

 

టాప్ హెడ్ లైన్స్

AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Fishermen Boat Capsized: విశాఖ తీరంలో బోటు బోల్తా.. తృటిలో తప్పించుకున్న ఏడుగురు మత్స్యకారులు
విశాఖ తీరంలో బోటు బోల్తా.. తృటిలో తప్పించుకున్న ఏడుగురు మత్స్యకారులు
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
Tollywood Fans Political Agenda: ఫ్యాన్స్ పేరుతో హీరోల ఇమేజ్‌తో ఆట - రాజకీయం కొత్త దిశలో వెళ్తోందా?
ఫ్యాన్స్ పేరుతో హీరోల ఇమేజ్‌తో ఆట - రాజకీయం కొత్త దిశలో వెళ్తోందా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Embed widget