Social Exam Date: ఏప్రిల్ 1న యథావిధిగా పదవ తరగతి సోషల్ ఎగ్జామ్
AP 10th Exams | ఏప్రిల్ 1న యథావిధిగా పదవ తరగతి సోషల్ ఎగ్జామ్ నిర్వహిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.

రేపు (01.04.2025) యథావిధిగా పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష జరుగుతుంది అని పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు.వి. IAS., తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం (01.04.2025) సోషల్ స్టడీస్ పరీక్ష యథావిధిగా నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందన్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు సంబంధించిన అందరు అధికారులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ విషయాన్ని ఆర్జేడీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సంబంధిత అధికారులు విద్యార్థులు, ఉపాధ్యాయులు & తల్లిదండ్రులకు తెలపాలని కోరారు.
మంగళవారం అప్షనల్ హాలీడేతో వచ్చిన కన్ఫ్యూజన్
ఏప్రిల్ 1వ తేదీ మంగళవారంను ఐచ్ఛిక సెలవు దినంగా (Optional Holiday) ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు ఈదుల్ ఫితర్(రంజాన్) పర్వదిన అనంతర రోజైన ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటిస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.దానితో రేపు టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష ఉంటుందా లేదా అని కొంత అనుమానం క్రియేట్ అయింది. ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ రేపు యధావిధిగా పరీక్ష ఉంటుందని స్పష్టత ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.
ఆల్రెడీ ఒక రోజు వాయిదా పడ్డ పరీక్ష
నిజానికి టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష సోమవారం నాడు జరగాల్సి ఉంది. కానీ రంజాన్ సెలవును దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్షను మంగళవారానికి (01.04.2025) వాయిదా వేశారు. కాబట్టి విద్యార్థులు, అధికారులు రేపటి పరీక్షకు సిద్ధం కావాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

