అన్వేషించండి

Small Room Coolers: చిన్న గదికి సరిపోయే బెస్ట్‌ కూలర్లు - ధర తక్కువ, మన్నిక ఎక్కువ!

Best Coolers For Small Rooms: ఎక్కువ స్థలాన్ని ఆక్రమించకుండా, ఏసీ లాంటి చల్లదనాన్ని అందించే ఎయిర్‌ కూలర్లు చిన్న గదికి అవసరం.

Best Air Coolers For Small Rooms In April 2025: వేసవి ఎండలు ఏప్రిల్‌ ప్రారంభంలోనే జనాన్ని ఫ్రై చేస్తున్నాయి. మే & జూన్‌ నాటికి జుట్టూడిపోయేలా మండిపోవచ్చు. ఉష్ణోగ్రతలు  పెరుగుతున్నందున, ఏసీ సదుపాయం లేని చోట ఎయిర్‌ కూలర్‌ ఉండడం తప్పనిసరి. బలమైన చల్లటి గాలిని అందించడం, తక్కువ విద్యుత్తు వినియోగించుకోవడం, సౌకర్యవంతమైన అనుభవం, నిశ్శబ్దంగా పని చేయడం, దీర్ఘకాల మన్నిక వంటివి మంచి కూలర్‌ లక్షణాలు. 

ఏదైనా చిన్న గది ఉంటే, దానికి సరిపోయే లక్షణాలతో విద్యుత్‌ను ఆదా చేయగల & కాంపాక్ట్ ఎయిర్ కూలర్‌ తీసుకోవాలి. అధునాతన హనీకూంబ్‌ కూలింగ్ ప్యాడ్స్‌ (honeycomb cooling pads,), ఇన్వర్టర్ అనుకూలత ‍‌(inverter compatibility), అదనపు శీతలీకరణ కోసం ఐస్ కంపార్ట్‌మెంట్‌ ‍‌( ice compartment) వంటివి ఆధునిక ఆప్షన్లలో భాగంగా వస్తున్నాయి. ఈ ఫీచర్లు ఎక్కువ విద్యుత్ బిల్లు రాకుండా చేస్తూనే, గదిలో ఏసీ లాంటి చల్లదనం పంచుతాయి.

మీ డబ్బుకు తగిన విలువను అందించే కొన్ని ఎయిర్ కూలర్‌లు:

బజాజ్ PX97 టార్క్ న్యూ 36L పర్సనల్ ఎయిర్ కూలర్ (Bajaj PX97 Torque New 36L Personal Air Cooler)

  • ధర: రూ. 5,749
  • కీలక ఫీచర్లు:
  • 30 ఫీట్‌ ఎయిర్ త్రో
  • 36 లీటర్ల వాటర్ ట్యాంక్
  • మన్నిక పెంచే డ్యూరామెరైన్ పంప్
  • శుభ్రమైన గాలి కోసం యాంటీ బాక్టీరియల్ హెక్సాకూల్ ప్యాడ్స్‌
  • మెరుగైన గాలి ప్రసరణ కోసం టర్బో ఫ్యాన్ టెక్నాలజీ
  • గాలి వేగం నియంత్రణ కోసం 3 ఆప్షన్లు
  • 3-సంవత్సరాల వారంటీ (1 సంవత్సరం స్టాండర్డ్‌ + 2 సంవత్సరాలు ఎక్స్‌టెండెడ్‌)

క్రాంప్టన్ ఓజోన్ 75L డెసర్ట్ ఎయిర్ కూలర్ (Crompton Ozone 75L Desert Air Cooler)

  • ధర: రూ. 9,799
  • కీలక ఫీచర్లు:
  • ఆటో-ఫిల్ టెక్నాలజీతో పెద్ద 75 లీటర్ల వాటర్ ట్యాంక్
  • 4-వే ఎయిర్‌ డిఫ్లెక్షన్‌ & 4200 m3/hr ఎయిర్ డెలివరీ
  • ఇన్వర్టర్ కంపాటబిలిటీ
  • శీతలీకరణ పెంచే ఐస్ చాంబర్
  • దీర్ఘకాలిక సామర్థ్యం కోసం హై-డెన్సిటీ హనీకూంబ్‌ ప్యాడ్స్‌
  • 1 సంవత్సరం వారంటీ

ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచిల్ 40L పోర్టబుల్ ఎయిర్ కూలర్ (Orient Electric Durachill 40L Portable Air Cooler)

  • ధర: రూ. 6,099
  • కీలక ఫీచర్లు:
  • ఏరోఫ్యాన్ టెక్నాలజీతో 17% ఎక్కువ ఎయిర్ డెలివరీ
  • 3-సైడ్ డెన్సెనెస్ట్ హనీకోంబ్ కూలింగ్ ప్యాడ్స్‌
  • దుమ్ము, కీటకాలను నివారించడానికి పూర్తిగా ముడుచుకునే లౌవర్లు
  • 3-స్పీడ్ సెట్టింగ్స్‌ & నీటి స్థాయి సూచిక
  • ఇన్వర్టర్ కంపాటబిలిటీ
  • 12 నెలల వారంటీ

లివ్‌ప్యూర్ కూల్‌బ్లిస్ 65L డెసర్ట్ ఎయిర్ కూలర్ (Livpure Koolbliss 65L Desert Air Cooler)

  • ధర: రూ. 8,399
  • కీలక ఫీచర్లు:
  • శుభ్రమైన గాలి కోసం యాంటీ బాక్టీరియల్ హనీకోంబ్‌ ప్యాడ్స్‌
  • మెరుగైన శీతలీకరణ కోసం ఐస్ చాంబర్
  • సులభంగా కదిలించేందుకు కింది భాగంలో చక్రాలు
  • సరైన సౌకర్యం కోసం శరీరానికి తగిలే స్థాయిలో గాలి దిశ
  • నీటి స్థాయి సూచిక
  • మోటార్‌ మీద 2 సంవత్సరాల వారంటీ

హవాయి మైటీ 12 పర్సనల్ ఎయిర్ కూలర్ (Havai Mighty 12 Personal Air Cooler)

  • ధర: రూ. 5,912
  • కీలక ఫీచర్లు:
  • 50 లీటర్ల వాటర్ ట్యాంక్
  • 120W పవర్‌తో 12-అంగుళాల ఫ్యాన్ బ్లేడ్
  • 15-ఫీట్‌ ఎయిర్‌త్రోతో 200 చదరపు అడుగుల కవరేజ్‌
  • విద్యుత్‌ ఆదా, తద్వారా డబ్బు ఆదా
  • అన్ని వైపులా సులభంగా జరిపేలా కాస్టర్ వీల్స్‌ 
  • 3-స్పీడ్ కంట్రోల్స్‌

ఏ ఎయిర్ కూలర్‌ ఎంచుకోవాలి?

పైన చెప్పిన ఎయిర్ కూలర్‌ల ధరలు & లక్షణాలు ఆయా కంపెనీల వెబ్‌సైట్‌లో పేర్కొన్నవి, వాటిలో మార్పులు ఉండవచ్చు. కంపెనీలు వెల్లడించిన ప్రకారం.. ప్రతి ఒక్కటి తక్కువ ధర, అధిక సామర్థ్యం, ఎక్కువ పనితీరును కనబరుస్తాయి. మీకు ఎక్కువ గాలిని అందించే  బడ్జెట్-ఫ్రెండ్లీ కూలర్‌ కావాలంటే బజాజ్ PX97 టార్క్ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెద్ద గదుల కోసం క్రాంప్టన్ ఓజోన్ 75L తీసుకోవచ్చని సూచిస్తున్నారు. పోర్టబిలిటీ & విద్యుత్‌ ఆదా వంటివి ప్రాధాన్యతలు అయితే, ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచిల్ 40L మంచి ఆప్షన్‌ అవుతుందని సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget