టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఐసీసీ విమెన్స్ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. తన కెరీర్లో ఫస్ట్ టైం టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 బౌలర్ స్థానాన్ని దక్కించుకుంది. ఈ లిస్ట్‌లో మొన్నటివరకు 736 పాయింట్లతో ఆసీస్ బౌలర్ అన్నబెల్లె సదర్లాండ్ ఉంటే.. శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌లో 20 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసిన దీప్తి.. ఇప్పుడు ఆమెను ఒక్క పాయింట్‌తో దాటి 737 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. కేవలం బౌలింగ్ ర్యాంకింగ్స్‌లోనే కాదు.. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లోనూ 390 పాయింట్లతో దీప్తి మూడో స్థానంలో ఉంది.
ఇక దీప్తి మాత్రమే కాకుండా.. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ జెమీమా.. కూడా విశాఖపట్నంలో శ్రీలంకపై 44 బంతుల్లో 66 రన్స్ బాది హాఫ్ సెంచరీతో మెరవడంతో బ్యాటర్ల లిస్ట్‌లో 5 స్థానాలు మెరుగు పరుచుకుని 9వ స్థానానికి చేరుకుంది. మన తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి కూడా 5 స్థానాలు మెరుగుపరుచుకుని 36వ స్థానానికి చేరుకుంది. ఇదిలా ఉంటే శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. శ్రీలంక టీమ్ 20 ఓవర్లలో 128 రన్స్ చేస్తే.. టీమిండియా షెఫాలీ వర్మ 34 బంతుల్లో 69 రన్స్‌తో విధ్వంసం సృష్టించడంతో 11.5 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసి బంపర్ విక్టరీ సాధించింది. దీంతో 5 టీ20ల సిరీస్‌లో 2-0తో టీమిండియా లీడ్‌లో ఉంది.





















