అన్వేషించండి

మొదటి రోజే 93 వేలకు పైగా బుకింగ్స్‌తో అదరగొట్టిన Mahindra XUV 7XO, మహీంద్రా XEV 9S

Mahindra XUV 7XO and XEV 9S లు మొదటి రోజునే 93 వేలకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. రూ. 20,500 కోట్ల విలువకు పైగా బుకింగ్స్‌ కంపెనీ చరిత్రలో ఇదొక రికార్డు అని మహీంద్రా తెలిపింది.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో SUV విభాగంలో కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.  మహీంద్రా & మహీంద్రా మరోసారి ఈ విభాగంలో తన పట్టు నిలుపుకుంది. మహీంద్రా కంపెనీ తన కొత్త ICE SUV Mahindra XUV 7XO, ఎలక్ట్రిక్ SUV Mahindra XEV 9S బుకింగ్‌లను ప్రారంభించింది. మొదటి రోజే ఈ రెండు కార్లకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. జనవరి 14న మధ్యాహ్నం 2 గంటల వరకు కంపెనీ మొత్తం 93,689 బుకింగ్‌లను నమోదు చేసుకుందని, ఇది ఒక పెద్ద రికార్డు అని మహీంద్రా కంపెనీ తెలిపింది..

రూ. 20,500 కోట్లకు పైగా బుకింగ్ విలువ

మహీంద్రాకు ఈ విజయం బుకింగ్‌ల సంఖ్యకు మాత్రమే పరిమితం కాలేదు. మహీంద్రా కంపెనీ ప్రకారం, ఈ బుకింగ్‌ల మొత్తం విలువ రూ. 20,500 కోట్లకు పైగా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధరల ఆధారంగా అంచనా వేశారు. ఈ సంఖ్య భారత కస్టమర్‌లు SUV విభాగంలో కొత్త,  సాంకేతిక పరిజ్ఞానంపై ఫోకస్ చేసిన ఉత్పత్తులపై నమ్మకం ఉంచారని స్పష్టమైంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ICE, ఎలక్ట్రిక్, రెండు రకాల SUVలను కస్టమర్‌లు ఎంతో నమ్మకంతో కొంటున్నారు. 

ICE, ఎలక్ట్రిక్ రెండు విభాగాలపై బలమైన పట్టు

Mahindra XUV 7XO, మహీంద్రా XEV 9S వేర్వేరు రకాల కస్టమర్‌లను దృష్టిలో ఉంచుకుని తయారుచేశారు. XUV 7XO ఒక సాంప్రదాయ ICE SUV. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లను కలిగి ఉంది. ఇది ఫ్యామిలీతో జర్నీ చేసేందుకు బాగుంటుంది. ఫీచర్‌లు, పనితీరు బ్యాలెన్స్ చేస్తుంది. అదే సమయంలో మహీంద్రా XEV 9S పూర్తిగా ఎలక్ట్రిక్ SUV, ఇది భవిష్యత్, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.  EVలకు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా XEV 9Sకి మంచి బుకింగ్‌లు వస్తున్నాయి. 

దశల వారీగా డెలివరీ

ఇంత భారీ సంఖ్యలో బుకింగ్‌లు వచ్చిన తర్వాత మహీంద్రా డెలివరీని దశల వారీగా చేయాలని నిర్ణయించుకుంది. కంపెనీ ప్రకారం, Mahindra XUV 7XO డెలివరీ జనవరి 14 నుంచి ప్రారంభమైంది. చాలా నగరాల్లో కస్టమర్‌లకు కార్లు కూడా అందడం ప్రారంభించాయి. అదే సమయంలో, ఎలక్ట్రిక్ SUV Mahindra XEV 9S డెలివరీ జనవరి 2026 చివరి వారంలో, జనవరి 26న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కంపెనీ సరఫరా, డీలర్ నెట్‌వర్క్‌ను మెరుగ్గా నిర్వహించగలదు.

SUV మార్కెట్లో మహీంద్రాకు పెరుగుతున్న బలం

ఆటో నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా మరింత పెరుగుతుంది. మహీంద్రా  XEV 9S వంటి SUVలు మహీంద్రాను EV విభాగంలో కూడా మార్పు తీసుకురాగలవు. మహీంద్రా XUV 7XO వంటి ICE మోడల్‌లు ఇంకా పూర్తిగా ఎలక్ట్రిక్‌కు మారకూడదనుకునే కస్టమర్‌లకు నచ్చుతాయి. 

ఈ బంపర్ బుకింగ్ ఏమి చెబుతుంది?

 Mahindra XUV 7XO, మహీంద్రా XEV 9S మొదటి రోజునే బంపర్ బుకింగ్ భారత SUV మార్కెట్లో మహీంద్రా ఆధిపత్యం నిరంతరం పెరుగుతోందని చూపుతుంది. రూ. 20,500 కోట్లకు పైగా బుకింగ్ విలువ, దాదాపు 94 వేల ఆర్డర్‌లు ఏదైనా ఆటోమేకర్ కోసం గొప్ప విజయంగా చెప్పవచ్చు. రాబోయే వారాల్లో డెలివరీలు ప్రారంభం అయితే, ఈ కార్లు రోడ్లపై రయ్ రయ్ మని దూసుకెళ్లనున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?
BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'
ఆగస్టు 15 సందర్భంగా మహీంద్రా BE 6కు కొత్త లుక్‌.. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక మార్పులు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget