ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
మహిళల టీ20 క్రికెట్లో షెఫాలీ వర్మ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. మంగళవారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 34 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 202 స్ట్రైక్ రేట్‌తో 69 రన్స్ బాది సూపర్ హాఫ్ సెంచరీ సాధించిన షెపాలీ.. ఈ హాఫ్ సెంచరీతో తన కెరీర్లో 12వ టీ20 హాఫ్ సెంచరీ సాధించింది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 22 ఏళ్ల లోపు అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించింది. షెఫాలీ తర్వాత చెరో 10 హాఫ్ సెంచరీలతో వెస్టిండీస్‌కి చెందిన స్టెఫానీ టేలర్, ఐర్లాండ్‌కు చెందిన గాబీ లెవిస్ సెకండ్ ప్లేస్‌లో ఉంటే.. ఇండియాకే చెందిన చెందిన జెమీమా రోడ్రిగస్ 7 హాఫ్ సెంచరీలతో మూడో ప్లేస్‌లో ఉంది. ఇదిలా ఉంటే షెపాలీ విధ్వంసంతో శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 129 పరుగుల టార్గెట్‌ని భారత్ కేవలం 11.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 120 ప్లస్ టార్గెట్‌ని భారత మహిళల టీమ్ ఇంత వేగంగా అందుకోవడం కూడా ఇదే తొలిసారి. ఇక ఈ విజయంతో 5 టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-1తో లీడ్‌లోకొచ్చింది. మూడో టీ20 26వ తేదీన తిరువనంతపురం వేదికగా జరగనుంది.





















