15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ డొమెస్టిక్ క్రికెట్లో అప్పోనెంట్ గా మారి ఫైట్ చేయబోతున్నారు. ఈరోజు బుధవారం నుంచి మొదలు కాబోతున్న విజయ్ హజారే ట్రోఫీ లో హిట్ మ్యాన్ ముంబై తరపున ఆడబోతుంటే.. కోహ్లీ ఢిల్లీ తరపున బరిలోకి దిగబోతున్నారు. తొలి మ్యాచ్ లో ఢిల్లీ ఆంధ్రతో తలపడబోతోంది అండ్ ముంబై సిక్కింతో తలపడబోతొంది. ఇక ఆంధ్ర, ఢిల్లీ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లో జరగాల్సీ ఉండగా.. సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా బెంగళూరు బీసీసీఐ ఎక్స్ లెన్స్ స్టేడియానికి మార్చారు. ఇక ముంబై సిక్కిం మ్యాచ్ జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం లో జరగనుంది. ఇదిలా ఉంటే కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు రిషభ్ పంత్ (ఢిల్లీ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్), మహమ్మద్ షమీ (బెంగాల్), హార్దిక్ పాండ్యా (బరోడా) వంటి స్టార్ ఆటగాళ్లు కూడా తమ రాష్ట్ర జట్ల తరపున బరిలోకి దిగుతున్నారు.





















