Akkada Ammayi Ikkada Abbayi Trailer: యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ చూశారా? - ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంటే!
Pradeep Machiraju Movie: బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు లేటెస్ట్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

Pradeep Machiraju's Akkada Ammayi Ikkada Abbayi Trailer Unvieled: బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) దాదాపు నాలుగేళ్ల తర్వాత మరోసారి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' (Akkada Ammayi Ikkada Abbayi). ఆయన సరసన జబర్దస్త్ ఫేం దీపికా పిల్లి (Deepika Pilli) హీరోయిన్‌గా నటిస్తుండగా తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
నవ్వులు పూయిస్తోన్న ట్రైలర్..
లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రదీప్ మాచిరాజు సివిల్ ఇంజినీర్‌గా కనిపించబోతున్నారు. 'స్టోరీ ఆఫ్ యావరేజ్ బిలో సివిల్ ఇంజినీర్' అని వీడియోలో కనిపించడం ఆసక్తిని పెంచేస్తోంది. ఓ గ్రామంలో ప్రాజెక్టు పనులు చేయించేందుకు వెళ్లిన ఆయన అక్కడి గ్రామస్థులతో కలిసి చేసే అల్లరి నవ్వులు పూయిస్తోంది. 'ఈ దేశంలో ఇంజినీరింగ్ చదివిన వాడు ఒక్క డాక్టర్ పని తప్ప ఏ పనైనా చేయగలడు' అంటూ సాగే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
అసలు ప్రదీప్ ఆ ఊరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?, ఊరిలో ఉన్న ఒకే ఒక్క అమ్మాయి దీపికా పిల్లితో ప్రదీప్‌కు పరిచయం ఎలా ఏర్పడింది? ఊరివాళ్లు అతన్ని ఎందుకు తలకిందులుగా వేలాడతీశారు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Also Read: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది - 'నాయాల్ది' .. సాంగ్ అదిపోయింది, మీరూ చూశారా?
ఏప్రిల్ 11న రిలీజ్
ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల కానుంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నితిన్, భరత్ దర్శకత్వం వహించారు. సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జీఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్‌పై మూవీ రూపొందిస్తుండగా ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా వచ్చిన ట్రైలర్ సైతం ఆకట్టుకుంటోంది.
నాలుగేళ్ల తర్వాత మళ్లీ హీరోగా..
ప్రదీప్ మాచిరాజు తనదైన టైమింగ్, కామెడీ పంచులతో.. బుల్లితెర యాంకర్‌గా టీవీ ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఓవైపు యాంకర్‌గానే కాకుండా మరోవైపు సినిమాల్లోనూ పలు రోల్స్ చేసి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత నాలుగేళ్ల వరకూ సినిమాలు చేయలేదు.
అటు యాంకర్‌గానూ కొన్ని షోలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ టైటిల్‌తోనే హీరోగా మళ్లీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి తాను రెమ్యునరేషన్ తీసుకోలేదని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రదీప్ తెలిపారు. ఇదో చందమామ కథలా ఉంటుందని చెప్పారు. ప్రదీప్ ఈ మూవీతో మంచి విజయం సాధించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

