Arjun S/O Vijayanthi First Song: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది - 'నాయాల్ది'... సాంగ్ అదిరిపోయింది, మీరూ చూశారా?
Nayaaldhi Song: నందమూరి కల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' నుంచి ఫస్ట్ సింగిల్ 'నాయాల్దీ..' వచ్చేసింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

Nandamuri Kalyan Ram's Arjun S/O Vyjayanthi Movie First Single Unveiled: నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram), సీనియర్ హీరోయిన్ విజయశాంతి (Vijayashanthi) తల్లీకొడుకులుగా వస్తోన్న లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' (Arjun S/O Vijayanthi). ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
నాయాల్దీ.. అదిరిపోయింది..
'చుక్కల చీర చుట్టేసి.. గజ్జల పట్టీలు కట్టేసి చెంగుమని నువ్వట్టా నడిచొస్తుంటే.. నాయాల్దీ..' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. కల్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ (Saiee Manjrekar) నటించగా.. మాస్ డ్యాన్స్‌తో ఇద్దరూ అదరగొట్టారు. యూత్ ఆడియన్స్‌కు జోష్ తెప్పించేలా సాగే బీజీఎం, స్టెప్పులు, లిరిక్స్ హైప్ పెంచేశాయి. ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించారు. ఈ పాటకు రఘురామ్ లిరిక్స్ అందించగా.. నకాష్ అజీజ్ ఆలపించారు. యూత్ ఆడియన్స్‌కు ఊపు తెచ్చేలా మాస్ సాంగ్‌తో కల్యాణ్ రామ్ అదరగొట్టారు.
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆసక్తిని పెంచేసింది. నీతి నిజాయితీ గల ఓ పోలీస్ ఆఫీసర్ వైజయంతి తన కొడుకు అర్జున్‌ను పోలీస్ ఆఫీసర్‌ను చేయాలని కలలు కంటుంది. అయితే, ఆమె కలను కొడుకు అర్జున్ నెరవేర్చాడా?, లేక డాన్‌గా మారాడా?, అసలు అర్జున్ పోలీస్ ఆఫీసరా, డానా?. తప్పు చేసింది కొడుకైనా సరే విధి నిర్వహణలో కచ్చితంగా ఉండే వైజయంతి ఏం చేశారు? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేంతవరకూ ఆగాల్సిందే.
Massy beats, peppy moves and a total vibe ❤🔥
— Ashoka Creations (@AshokaCOfficial) March 31, 2025
'𝐀𝐑𝐉𝐔𝐍 𝐒/𝐎 𝐕𝐘𝐉𝐀𝐘𝐀𝐍𝐓𝐇𝐈' First Single #Nayaaldhi out now 💥
▶️ https://t.co/wHGJuHInUN
A @AJANEESHB musical.
Sung by @AzizNakash & @SonyKomanduri
Lyrics by #Raghuram
Choreography by @OfficialSekhar
In cinemas… pic.twitter.com/szAaE2zhjL
ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్థన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

