Sanju Samson in IPL 2026 | క్లాసెన్ ను విడుదుల చేయనున్న SRH ?
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు టీమ్స్ లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్ సంజు శాంసన్ ... ఆ ఫ్రాంచైజీ నుంచి రిలీజ్ కావాలని అనుకుంటున్నట్లు గత కొన్ని నెల్లలుగా వార్త;యూ వినిపిస్తూనే ఉన్నాయి. 2025 మెగా వేలానికి ముందు జోస్ బట్లర్‌ను రిలీజ్ చేసిన తర్వాత నుంచి ఆర్ఆర్ మేనేజ్‌మెంట్‌తో సంజూ శాంసన్‌కు మంచి సంబంధాలు లేవని టాక్. అందుకే RR ను వీడాలని సంజె నిర్యానించుకున్నాడట. ఈ క్రమంలోనే CSK సంజుతో చేతులు కలపడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది.
CSK సంజును ట్రేడ్ రూపంలో దక్కించుకోవాలని చూస్తుందట. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవడానికి ధోనీ త్వరలోనే మానెజ్మెంట్స తో మావేశం కానున్నారట. సంజు శాంసన్‌ను ట్రేడ్ చేసుకోవడం గురించి లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తోకూడా RR చర్చలు జరుపుతున్నారు.
ఇది ఇలా ఉంటె SRH కూడా ఆల్మోస్ట్ RR బాటలోనే నడుస్తుంది. హెన్రిచ్ క్లాసెన్‌ను సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సీజన్‌లో సన్‌రైజర్స్ క్లాసెన్‌ను 23 కోట్లకు రిటైన్ చేసింది. అయితే సన్‌రైజర్స్ ఇప్పుడు క్లాసెన్‌ను విడుదల చేసి వేలంలో తిరిగి తక్కువ మొత్తానికి కొనుగోలు చేయాలని చూస్తున్నారట. మరి వీరిద్దరిలో ఎవరు ఏ టీమ్ లోకి వెళ్తారో చూడాలి.





















