Vijay Divorce Case : విజయ్ విడాకుల కేసు - కోర్టులో భార్య సంగీత మరో పిటిషన్
TVK Vijay Divorce Case : స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్‌కు మరో షాక్ తగిలింది. ఆయన భార్య సంగీత కోర్టులో మరో పిటిషన్ వేశారు. విడాకుల కేసు ముగిసే వరకూ భర్త ఇంట్లోనే ఉండేందుకు అనుమతించాలని కోరారు.

Kollywood Actor Vijay Wife Sangeetha Another Petition In The Court : ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ, రాజకీయ వర్గాల్లో స్టార్ హీరో విజయ్ విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే తనకు విజయ్ నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించారు. తాజాగా మరో పిటిషన్ వేశారు.
విజయ్ ఇంట్లోనే ఉంటానంటూ...
విడాకుల కేసు ముగిసే వరకూ తనను విజయ్‌తోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ వేశారు సంగీత. ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉంటున్నారు. కేసు కంప్లీట్ అయ్యే వరకూ విజయ్ ఇంట్లోనే ఉండేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ మరోసారి కోర్టును ఆశ్రయించారు. త్వరలోనే ఈ పిటిషన్ విచారణకు రానుంది. గత నెల 24న తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో సంగీత విడాకుల పిటిషన్ వేశారు.
2021లో తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉండడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొంటూ ఆయన నుంచి విడిపోయేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత విజయ్ తనయుడు జాసన్ సంజయ్ కూడా తండ్రిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు. ఏప్రిల్ 20న వీరి విడాకుల కేసు విచారణకు రానుంది. ఆ రోజున విజయ్ కోర్టుకు హాజరు కావాలని ఇప్పటికే కోర్టు నోటీసులు ఇచ్చింది. తాజా పిటిషన్‌తో మరోసారి డివోర్స్ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : గద్దర్ అవార్డ్స్... బెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి - బెస్ట్ యాక్టర్‌గా చై, హీరోయిన్ రష్మిక
రూ.250 కోట్ల భరణం?
ప్రస్తుతం పొలిటికల్‌గా ప్రత్యర్థులకు ఈ డివోర్స్ అంశం ఆయుధంగా మారగా... వీలైనంత త్వరగా ఈ అంశానికి ముగింపు పలకాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంగీత నుంచి విడాకులు తీసుకునేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్లు తమిళ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. భార్యకు దాదాపు రూ.250 కోట్ల భరణం ఇచ్చేందుకు విజయ్ రెడీ అయినట్లు సమాచారం.
ఇందుకు ఆమె ఓకే అంటే ఏప్రిల్ 20 లోపు అవుటాఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవుతుందని అందరూ భావించారు. అయితే, తాజాగా కోర్టులో మరో పిటిషన్ వేయడంతో ఈ భరణం తీసుకునేందుకు ఆమె అంగీకరిస్తారా? లేదా? అనే సస్పెన్స్ నెలకొంది. కోర్టు కేసు ముగిసే వరకూ విజయ్‌తోనే ఉండేలా అనుమతివ్వాలని ఆమె కోరడంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది.
త్రిషతో విజయ్
నటితో వివాహేతర సంబంధం వల్లే తన భర్త విజయ్ నుంచి విడాకులు కోరుతున్నట్లు సంగీత ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా విజయ్, హీరోయిన్ త్రిష కలిసి కనిపించడం పెద్ద చర్చకే దారి తీసింది. తమిళ నిర్మాత, వ్యాపారవేత్త కల్పాత్తి ఎస్ సురేష్ తనయుడి వివాహ రిసెప్షన్‌లో వీరిద్దరూ జంటగా కనిపించారు. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌పై రూమర్స్ రాగా... అదే నిజం అయ్యిందంటూ రాజకీయ, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఇద్దరూ కలిసి జంటగా వచ్చి క్లారిటీ ఇచ్చారని అంటున్నారు.
#Thalapathy @TVKVijayHQ President #Vijay and #Trisha attend #KalpathiSSuresh - #MeenakshiSuresh 's son wedding reception @actorvijay @trishtrashers pic.twitter.com/iQOQet9Z0A
— Nikil Murukan (@onlynikil) March 5, 2026
ట్రెండింగ్ వార్తలు




















