Ustaad Bhagat Singh : పవర్ స్టార్ డబ్బింగ్ షురూ - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఎప్పుడంటే?
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. పవన్, హరీష్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

Pawan Kalyan Starts Dubbing Works For Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఊచకోత మొదలైంది. యాక్షన్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా దీనిపై బిగ్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ హరీష్ శంకర్.
పవన్ డబ్బింగ్... తమన్ బీజీఎం
ఈ మూవీ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ సైతం బీజీఎం వర్క్స్ ప్రారంభించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసింది. 'పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ పర్యవేక్షిస్తున్నారు. తమన్ అద్భుతమైన బీజీఎం అందించడానికి కృషి చేస్తున్నారు. సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి' అంటూ రాసుకొచ్చింది.
View this post on Instagram
Also Read : ధురంధర్ 2 ట్రైలర్ రివ్యూ - వయలెన్స్‌తో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ వేరే లెవల్
ట్రైలర్ ఎప్పుడంటే?
ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, సాంగ్స్ బిగ్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. దేఖ్ లేంగే సాలాతో వింటేజ్ పవన్ లుక్, స్టైల్ అదిరిపోయింది. ఈ పాటలో పవన్ స్టెప్పులను ఫ్యాన్స్ వరల్డ్ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్‌తో పోలుస్తూ పోస్టులు పెట్టారు. ఇక రెండో సాంగ్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పవ'నిజాన్ని' చూపించింది. ఆయన మార్క్ స్టైల్, లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక సినిమా ట్రైలర్ ఎప్పుడా? అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ చేస్తున్నారు.
అయితే, 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్‌ను సడన్ సర్ప్రైజ్‌గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు హడావిడి, ప్రోమోలు లేకుండా ట్రైలర్ రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దర్శకధీరుడు రాజమౌళి స్ట్రాటజీని డైరెక్టర్ హరీష్ శంకర్ అండ్ టీం ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. విజువల్ వండర్ 'వారణాసి' పాటను కూడా సడన్ సర్ప్రైజ్‌గా ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సోషల్ మీడియాలో వదిలేశారు. ఈ మూవీ ట్రైలర్ కూడా అలాగే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.
వారం ముందుగానే...
అనుకున్న దాని కంటే వారం ముందుగానే మూవీ రిలీజ్ కానుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఉగాది సందర్భంగా ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో మార్చి 26న రిలీజ్ చేయాలని భావించినా... వరుసగా వచ్చే లాంగ్ వీకెండ్స్, దాదాపు 2 వారాల పాటు ఉండే సమ్మర్ హాలిడేస్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మూవీలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. తమిళ సీనియర్ హీరో పార్తీబన్ విలన్ రోల్ చేశారు. వీరితో పాటే అశుతోష్ రాణా, చమ్మక్ చంద్ర, గౌతమీ, నవాబ్ షా, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.
ట్రెండింగ్ వార్తలు




















