సిరీస్ భారత్‌దే.. వన్డేల పగ టీ20లతో తీర్చుకున్న టీమిండియా
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదో టీ20 వర్షం కారణంగా రద్దైపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23, శుబ్‌మన్ గిల్ 16 బంతుల్లో 29 రన్స్ చేయడంతో 4.5 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 52 రన్స్ చేసి జోరుమీదున్న టైంలో.. సడెన్‌గా ఆకాశంలో భారీగా మెరుపులు రావడం మొదలైంది.
దీంతో మ్యాచ్‌ని ఆపేశారు. ఇక కొద్ది సేపటికి భారీగా వర్షం మొదలవడంతో దాదాపు గంటకు పైగా రీ-మ్యాచ్ కోసం రెండు జట్లు డగౌట్‌లో వెయిట్ చేశాయి. కానీ వర్షం తగ్గినా.. పిచ్ పూర్తిగా తడిసిపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక ఈ మ్యాచ్ రద్దు కావడంతో మొత్తం 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి ఆఖరి మ్యాచ్‌లు వర్షార్పణం కాగా.. మిగిలిన మూడు మ్యాచ్‌లను 2-1తో గెలుచుకున్న భారత్.. సిరీస్ సొంతం చేసుకుంది.
దీంతో వన్డే సిరీస్ పోగొట్టుకుని అవమానపడిన టీమిండియా.. టీ20 సిరీస్ గెలిచి పగ తీర్చుకుంది. ఇక ఈ సిరీస్ మొత్తం తన బ్యాటింగ్‌తో అదరగొట్టి 3 మ్యాచ్‌ల్లో 163 రన్స్ చేసిన అభిషేక్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.





















