Sachin Advt in Sujeeth Direction | యాడ్స్‌కి దర్శకత్వం వహించిన సుజిత్
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ క్రికెట్ ‘OG’ సచిన్ టెండూల్కర్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. సచిన్ టెండూల్కర్ ఒక కంపెనీకి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. సచిన్ టెండూల్కర్‌కి సంబంధించిన రెండు యాడ్ ఫిల్మ్స్ కి OG డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించాడు. ఈ యాడ్స్ కి సంబందించిన ఫొటోస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.
ముంబైలో గాడ్ అఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ తో యాడ్స్ షూట్‌ని పూర్తి చేశాడు డైరెక్టర్ సుజిత్. Extremely delighted to work with the god himself అంటూ డైరెక్టర్ సుజీత్ సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసాడు. సుజిత్ దర్శకత్వంలో సచిన్ టెండూల్కర్ అంటే ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం సుజీత్ నేచురల్ స్టార్ నానితో ఒక సినిమా చేయనున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ మూవీ చేస్తున్న నాని, 2026 మార్చి నుంచి సుజీత్ డైరెక్షన్ లో షూటింగ్ మొదలు పెట్టనున్నాడు.





















