Chikiri Chikiri Song: 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ మర్చిపోయేలా చేసిన చికిరి చికిరి
Ram Charan Peddi Updates: మెగా అభిమానులను 'గేమ్ ఛేంజర్' డిజప్పాయింట్ చేసింది. ఆ ఫ్లాప్ మర్చిపోయేలా చేసింది 'పెద్ది' సినిమాలోని 'చికిరి చికిరి' సాంగ్. కొత్త జోష్ ఇచ్చింది.

సంక్రాంతికి విడుదలైన 'గేమ్ చేంజర్' మీద మెగా ఫ్యాన్స్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ సినిమా వాళ్ళను దారుణంగా డిజప్పాయింట్ చేసింది. సినిమా ఎంత దెబ్బ కొట్టిందంటే... ఏకంగా రామ్ చరణ్ పేరు ముందు గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసింది పెద్ది టీం. తరుణంలో రాబోయే సినిమా విడుదలకు ముందు ఎంత నెగెటివిటీ ఫేస్ చేయాల్సి ఉంటుందో అని అభిమానులు కాస్త కంగారు పడిన మాట వాస్తవం. అయితే వాళ్లకు ఫుల్ బూస్ట్ ఇచ్చింది చికిరి చికిరి సాంగ్.
ఇన్‌స్టంట్ బ్లాక్ బస్టర్
పెద్ది సినిమా విడుదలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన డిజాస్టర్ గేమ్ చేంజర్ తర్వాత చరణ్ యాక్ట్ చేసిన సినిమా ఇదే. సంక్రాంతి నుంచి సోషల్ మీడియాలో, ఇతర హీరోల ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ విపరీతంగా ఉంది. దాన్ని ఒక్క దెబ్బకు తుడిచి పెట్టేసింది చికిరి చికిరి పాట.
పెద్దికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. రామ్ చరణ్ లాస్ట్ సినిమా ఫ్లాప్ అంటే రెహమాన్ తెలుగులో మ్యూజిక్ చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాపులే. మెగా అభిమానులలో ఆ భయం కూడా ఉంది. కానీ మొదటి పాటతో భయాలు అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టారు. రిలీజ్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది సాంగ్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాటే వినపడుతోంది. చార్ట్ బస్టర్ అయ్యింది. సినిమాకు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా పాటలో రామ్ చరణ్ డ్యాన్స్, ఆ డ్యాన్సులో గ్రేస్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది.
Also Read: 'జటాధర' ఓపెనింగ్ డే కలెక్షన్స్... సుధీర్ బాబు కెరీర్‌లో మరో డిజాస్టర్?
పుట్టినరోజుకు సినిమా...
రామ్ చరణ్ సరసన జాన్వికపూర్ నటిస్తున్న పెద్ది సినిమాను వృద్ధి సినిమాస్ అధినేత వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పకులు. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల చేయనున్నారు.
Also Read: 'జటాధర' రివ్యూ: సుధీర్ బాబు కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా? - అసలు థియేటర్లలో ఈ సినిమాను చూడగలమా?





















