Kancha Gachibowli Lands Issue: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - తెలంగాణ సర్కార్‌కు ఊహించని షాక్
Telangana: కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ ఇష్యూలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణం అక్కడ జరుగుతున్న పనుల్ని ఆపేయాలని ఆదేశించింది.

Supreme Court: హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ భూముల్లో తక్షణం పనులు ఆపేయాలని ఆదేశాలు జారీచేసింది. చెట్లు కొట్టివేయడం చాలా తీవ్రమైన అంశమని జస్టిస్ గవాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరరని.. తెలంగాణ సీఎస్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల నరికివేతగా సుమోటోగా విచారణ చేపట్టామని.. హైకోర్టు రిజిస్ట్రార్ ను ప్రత్యక్ష పరిశీలనకు పంపించి నివేదిక తెప్పించుకున్నామన్నారు. ఆ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్నామని జస్టిస్ గవాయ్ ప్రకటించారు.
అటవీ భూముల్లో కూల్చివేతలకు అటవీ పర్మిషన్ తీసుకున్నారా ?
కంచ గచ్చిబౌలి భూముల్లో భారీ నిర్మాణాలు చేపట్టినట్లుగా గుర్తించామని సుప్రీంకోర్టు తెలిపారు. నెమళ్లు ఇతర వన్య ప్రాణాలు ఉండే వంద ఎకరాల ప్రాంతాన్ని ధ్వంసం చేసినట్లుగా నివేదిక వచ్చిందని సుప్రీంకోర్టు తెలిపింది. పర్యావరణ, ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారో లేదో అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగణ సీఎస్‌ను సుప్రీంకోర్ుట ఆదేశించిందది. అటవీ ప్రాంతంలో ఎందుకు చెట్లు నరికేశారని ప్రశ్నించింది. రిట్ పిటిషన్ తయారు చేయాలని అమికస్ క్యూరికీ సుప్రీంకోర్టు సూచించింది. తెలంగాణ సీఎస్ ను ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఏదైనా ఉల్లంఘన జరిగితే సీఎస్‌దే బాధ్యతని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆరు నెలల వరకూ కంచగచ్చిబౌలి భూముల స్థితి యథాతథం
ఈ క్రమంలో సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీకి ఆరు నెలల సమయం ఇచ్చింది. అంటే మరో ఆరు నెలల వరకూ అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేదని అనుకోవచ్చు. మరో వైపు హైకోర్టులోనూ ఈ అంశంపై విచారణ జరిగింది. కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.
హైకోర్టులోనూ వాదనలు
సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉన్న 400 ఎకరాల్లోని చెట్లను నరికి వేస్తున్నారని.. అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనాన్ని కోరారు. అయితే, పిటిషన్‌పై మధ్యాహ్నం 3.45కు విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. అప్పటి వరకు ప్రభుత్వం పనులు చేపడుతున్న స్థలాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టుకు తెలుపగా.. హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని జస్టిస్ బీర్ గవాయ్ స్పష్టం తెలిపారు. తర్వాత ఉన్నత న్యాయస్థానంలోనూ స్టే వచ్చింది. ఒకే కేసులో ఇలా హైకోర్టు, సుప్రీంకోర్టులు ఒకే రోజు విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.





















