అన్వేషించండి

MLA Mal Reddy: కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ మంటలు - రాజీనామా ఆఫర్ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి

Telangana Cabinet: మంత్రి పదవి కోసం రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రకటించారు. అయితే ఆయన పార్టీ ధిక్కారంగా కాకుండా.. పార్టీ కోసమే అలా చేస్తానంటున్నారు.

MLA Mal Reddy Ranga Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి వర్గ విస్తరణ హీట్ కనిపిస్తోంది. హైకమాండ్ నుంచి పేర్లు రాకపోవడంతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఉగాది రోజు అనుకున్నారు. కానీ జరగలేదు. ఆ రోజు సీఎం రేవంత్.. గవర్నర్ ను కలవడంతో మూడో తేదీన మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని అనుకున్నారు. మూడో తేదీ వచ్చినా కాంగ్రెస్ లో ఎలాంటి సందడి కనిపించడం లేదు. అయితే ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. తాజాగా ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు.                        

రెడ్డి సామాజికవర్గం అయినందున అవకాశం ఇవ్వలేకపోతే.. ఏ సామాజికవర్గానికి అవకాశం ఇస్తారో చెబితే ఆ సామాజికవర్గం నేతను తన నియోజకవర్గం ఇబ్రహీపట్నం నుుంచి నిలబెట్టి గెలిపిస్తానని ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కు వచ్చిన సీట్లలో ఇబ్రహీంపట్నం ఒకటి. గ్రేటర్ లో ఇంకెక్కడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. ఈ సమీకరణాలతో తనకు అవకాశం వస్తుందని మల్ రెడ్డి అనుకుంటున్నారు. అయితే మొత్తం  భర్తీ చేసే సీట్లలో  రెడ్డి సామాజికవర్గానికి ఒకటే ఇస్తారని భావిస్తున్నారు. ఇది ..  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి ఇంకా.. ఒత్తిడి ఉంటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారని భావిస్తున్నారు. ఇప్పటికి నల్లగొండ నుంచి ఇద్దరు రెడ్డి సామాజికవర్గ మంత్రులు ఉన్నారు. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కూడా ఒకరు.

ఒకే జిల్లాకు మూడు రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే .. అదీ కూడా సోదరులిద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తమ పరిస్థితి ఏమిటని ఇతర రెడ్డి సామాజికవర్గం ఎమ్యేల్యేలు అంటున్నారు. అందుకే రాజీనామా చేస్తానని మల్ రెడ్డి రంగారెడ్డి అంటున్నారు. గత ఎన్నికల్లో  బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై 40,127ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 38 ఏండ్ల తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. . కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఎం అభ్యర్థి ఒక్కసారి గెలిచినప్పటికీ నేరుగా కాంగ్రెస్ నేతలు గెలుపొందలేదు. 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఏజీ కృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో సీపీఎం, తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు.అసాధ్యం అనుకున్న చోట భారీ విజాయన్ని సాధించి పెట్టానని అందుకే తనకు మంత్రి దవి ఇవ్వాలని మల్ రెడ్డి కోరుతున్నారు. 

మల్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.   2014లో కాంగ్రెస్‌ టికెట్‌కోసం ప్రయత్నించినప్పటికీ ఆయనను మహేశ్వరం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపారు. 2018లో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించగా.. టికెట్‌ రాకపోవటంతో 2018లో ఆయన బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2023లో విజయం ఆయన సొంతమైంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Rahul Gandhi in Germany: జర్మనీలోని BMW ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్ గాంధీ; భారతదేశంలో ఉత్పత్తి పెంచాలని సూచన !
జర్మనీలోని BMW ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్ గాంధీ; భారతదేశంలో ఉత్పత్తి పెంచాలని సూచన !
Embed widget