అన్వేషించండి

Iran War Updates: హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!

Hormuz: అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హెర్మూజ్ జలసంధి పై పట్టు సాధించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి అమెరికా తన వ్యూహాలకు పదును పెడుతోంది. భారీగా రక్షణ చర్యలు చేపడుతోంది.

America attempt to free the Strait of Hormuz:   హెర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు పెరగడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే అమెరికా నావికాదళం నేరుగా వాణిజ్య నౌకలకు  ఎస్కార్ట్  ఇస్తుందని ప్రకటించారు. ఇరాన్  ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ప్స్ ఈ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించినందున, ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అమెరికా తన నౌకాదళాన్ని యుద్ధ ప్రాతిపదికన మోహరించింది.

 మల్టీ-నేషనల్ టాస్క్ ఫోర్స్ విస్తరణ 

గతంలో ఎర్ర సముద్రంలో నౌకల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఆపరేషన్ ప్రోస్పెరిటీ గార్డియన్  తరహాలోనే, ఇప్పుడు హెర్మూజ్ జలసంధి కోసం ఒక బహుళ పక్ష కూటమిని అమెరికా సిద్ధం చేస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్,  జపాన్ వంటి దేశాలు ఈ ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ దేశాల నాయకులు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తూ, ఇరాన్ చేస్తున్న డ్రోన్ దాడులను తీవ్రంగా ఖండించారు.

 గగనతలం నుండి నిఘా.. సముద్రంలో దాడులు 

పెంటగాన్ వర్గాల సమాచారం ప్రకారం, అమెరికా ఇప్పటికే  A-10 వార్‌ప్లేన్లు , *అపాచీ హెలికాప్టర్లను  ఈ ప్రాంతంలో రంగంలోకి దించింది. ఇరాన్ ప్రయోగిస్తున్న ఆత్మాహుతి డ్రోన్లు, స్పీడ్ బోట్లను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగుతోంది. ఇటీవల జరిగిన దాడుల్లో సుమారు 120కి పైగా ఇరాన్ నౌకలను,    44 బోట్లను అమెరికా దళాలు ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. సముద్ర మార్గంలో స్వేచ్ఛాయుత రవాణా  తమ ప్రాధాన్యతని వాషింగ్టన్ స్పష్టం చేస్తోంది.

 ఆర్థిక ఆంక్షల సడలింపు వ్యూహం 

యుద్ధ విమానాలే కాకుండా, అమెరికా మరో ఆర్థిక వ్యూహాన్ని కూడా అమలు చేస్తోంది. ఇరాన్‌కు ఉన్న పట్టును తగ్గించేందుకు, ప్రస్తుతం సముద్రంలో నిలిచిపోయిన సుమారు 140 మిలియన్ బారెళ్ల ఇరాన్ ముడిచమురుపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా తొలగించాలని అమెరికా ట్రెజరీ యోచిస్తోంది. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగకుండా నియంత్రించి, ఇరాన్ తన చమురు బ్లాక్ మెయిలింగ్ పవర్‌ను కోల్పోయేలా చేయడమే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం.   

 ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం 

ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో సుమారు 20-25 శాతం ఈ హెర్మూజ్ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా అడ్డుకుంటే, ముడిచమురు ధరలు లీటరుకు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే బ్యారెల్ ధర 100 మార్కును దాటడంతో, భారత్ వంటి దేశాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే భారత్ కూడా తన నౌకల భద్రత కోసం ఈ ప్రాంతంలో యుద్ధ నౌకలను నిరంతరం నిఘాలో ఉంచుతోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget