అన్వేషించండి

Pradip Guruji: మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!

fake note racket: గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగుచూసిన నకిలీ నోట్ల ఉదంతం సినిమా కథను తలపిస్తోంది. మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని ఓ గురూజీ దొంగ నోట్లు ముద్రిస్తున్నాడు.

Pradip Guruji fake note racket:   ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతూ, సమాజ సేవ పేరుతో కోట్లాది రూపాయల దొంగ నోట్లను ముద్రించిన ప్రదీప్ గురూజీ అలియాస్ ప్రదీప్ జోతంగియా ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ 
ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రదీప్ గురూజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం విని అందరూ నోరెళ్లబెట్టారు.  మంచి పనులు   చేయాలనుకున్నాం, కానీ మా దగ్గర తగినన్ని డబ్బులు లేవు. అందుకే మాకు కావలసిన డబ్బును మేమే తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం  అని ఆయన పోలీసుల విచారణలో చాలా సాధారణంగా చెప్పుకొచ్చారు. సమాజ సేవ కోసం చేసిన తప్పు కాబట్టి అది నేరం కాదన్నట్లుగా ఆయన వాదించడం గమనార్హం.
 
సూరత్‌లో శ్రీ సత్యం యోగ ఫౌండేషన్  పేరిట ఆశ్రమాన్ని నడుపుతున్న ఈ గురూజీ, తన అనుచరులతో కలిసి ఈ ముఠాను ఏర్పాటు చేశారు. యోగా తరగతులు, ఆధ్యాత్మిక బోధనల ముసుగులో గత మూడు నాలుగు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా తన ఆశ్రమంలోనే నకిలీ నోట్ల కర్మాగారాన్ని నడిపించారు. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక కారును వెంబడించి పట్టుకోవడంతో, సుమారు  రూ. 2.38 కోట్ల  విలువైన నకిలీ నోట్లు  బయటపడ్డాయి.
 
ఈ గ్యాంగ్ సామాన్యమైన దొంగ నోట్లు తయారు చేయలేదు. దొంగ నోట్ల ముద్రణకు అవసరమైన హై-క్వాలిటీ సెక్యూరిటీ పేపర్‌ను వీరు  చైనా నుండి ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకున్నారు. విచారణలో బయటపడిన మరో విస్తుపోయే విషయం ఏమిటంటే.. వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ,  ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి అసలు నోట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా డిజైన్లను రీప్రొడ్యూస్ చేశారు. నోట్లపై ఉండే వాటర్‌మార్క్, సెక్యూరిటీ థ్రెడ్‌లను కూడా అత్యంత నేర్పుగా సృష్టించారు.
 
గురూజీ అరెస్ట్ అయిన తర్వాత ఆయనకు ఉన్న పలుకుబడి చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఆయనకు పలువురు రాజకీయ నేతలు, మాజీ ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సోషల్ మీడియా ఫోటోల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వ వాహనాలపై ఉండే తరహా గుర్తులను  తమ వాహనాలపై వేసుకుని, పోలీసుల కళ్లు గప్పి రాష్ట్రవ్యాప్తంగా ఈ నోట్లను చలామణి చేసేందుకు ప్లాన్ చేశారు. ఏజెంట్లకు 20 నుండి 25 శాతం కమిషన్ ఇస్తూ మార్కెట్లోకి ఈ నోట్లను వదిలినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 

 
 సేవ కోసమే నోట్లు ముద్రించాం అని గురూజీ ఎన్ని కల్లిబొల్లి కబుర్లు చెప్పినా పోలీసులు మాత్రం కఠినంగానే ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి నేరాలు దేశద్రోహం కిందకే వస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం గురూజీతో పాటు ఏడుగురు అనుచరులను అరెస్ట్ చేసి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యు ఫోరెన్సిక్ టీమ్ సాయంతో ఈ నకిలీ నోట్ల నెట్‌వర్క్ ఎంత లోతుగా ఉందో ఆరా తీస్తున్నారు.


 

టాప్ హెడ్ లైన్స్

Drone Smuggling Syndicate: సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, హెరాయిన్ స్మగ్లింగ్.. ఇద్దర్ని అరెస్టు చేసిన ఎన్ఐఏ
సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, హెరాయిన్ స్మగ్లింగ్.. ఇద్దర్ని అరెస్టు చేసిన ఎన్ఐఏ
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
NATS: తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Embed widget