అన్వేషించండి

AP Cabinet : రామానాయుడు స్టూడియో భూముల స్వాధీనం - రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం - ఏపీ సర్కార్ కొరడా తీసిందా?

Vizag Lands: విశాఖ రామానాయుడు స్టూడియో భూముల్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రుషికొండ ప్యాలెస్ ను ఎలా వాడుకోవాలన్నది మంత్రులు అంతా కలిసి డిసైడ్ చేయాలని నిర్ణయించారు.

Vizag Rama naidu Studio: విశాఖ రామానాయుడు స్టూడియో భూములను రియల్ ఎస్టేట్ కు ఉపయోగించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది.   విశాఖలోని రామానాయుడు స్టూడియోలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విల్లాలు కట్టాలనుకున్న 15.17 ఎకరాలల భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో వైఎస్ హయాంలో 34.44 ఎకరాలను సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రామానాయుడు స్టూడియోకు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. అయితే అందులో అంతటా స్టూడియో నిర్మించలేదు. నిబంధనల ప్రకారం ఇతర అవసరాలకు ఆ భూమిని ఉపయోగించకూడదు. వినియోగిస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. 

కొంత భూమిని రియల్ ఎస్టేట్ చేస్తున్న రామానాయుడు స్టూడియో         

అయితే రామానాయుడు స్టూడియో యాజమాన్యం అందులోని 15.17  ఎకరాలను రియల్ ఎస్టేట్ గా మార్చి నివాస ప్రాంతాలుగా వినియోగించుకునేందుకు 2023లో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకున్నారు.   ఇది నిబంధనలకు విరుద్ధమని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇచ్చిన ప్రయోజనం కోసం కాకుండా ఇతర పనులకు ఉపయోగిస్తే స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో  రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా..  రామానాయుడు స్టూడియో యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విశాఖ కలెక్టర్ ను ఆదేశించారు. వారు ఇచ్చే వివరణ తర్వాత భూములను వెనక్కి తీసుకుంటూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉది.  ఆ భూమి మొత్తాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు మిగతా స్టూడియో నిర్మించిన భూమిపైనా నియంత్రణ ఉంచాలని భావించే అవకాశం ఉంది. సినీ అవసరాలకు తప్ప దేనికి ఉపయోగించినా ఆ భూమిని మళ్లీ వెనక్కి తీసుకుంటారు. 

రుషికొండ ప్యాలెస్ పై కేబినెట్ లో చర్చ         

మరో వైపు విశాఖ రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోంది. ఈ అంశంపై కేబినెట్ భేటీలోనూ చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ భవనం నిరుపయోగంగా ఉంటోందని నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. దీంతో చంద్రబాబునాయుడు ఆ భవనాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నదానిపై పరిశీలన చేయాల్సి ఉందన్నారు. మంత్రులు అంతా.. రుషికొండ ప్యాలెస్ ను చూసి రావాలని చంద్రబాబు సలహా ఇచ్చారు. ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందో సలహాలివ్వాలని సూచించినట్లుగా తెలుస్తోంది.       

టూరిజం కాటేజ్ ఉండే ప్రాంతాన్ని కూలగొట్టి విలాసవంతమైన ప్యాలెస్ ను వైసీపీ ప్రభుత్వం నిర్మించింది. స్టార్ హోటల్ అని చెప్పినప్పటికీ అందులో గట్టిగా ఐదు బిల్డింగులో ఒక్కో దానిలో  మూడు, నాలుగు బెడ్ రూములు మాత్రమే ఉన్నాయి. హోటల్  గదులు కట్టినట్లుగా కట్టలేదు.  కనీసం కాటేజీలు కట్టినట్లుగా కట్టలేదు. జగన్ మోహన్ రెడ్డి తాను మళ్లీ అధికారంలోకి వస్తానని విశాఖ నుంచి పరిపాలించడానికి ప్రజాధనంతో ఆ నివాసాన్ని నిర్మించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ విధ్వంసం చేసినట్లుగా ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పుడు ఆ భవనాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వానికి కూడా సవాల్ గా మారింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rains: తెలంగాణలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలో 124 మండలాల్లో వడగాల్పులు
తెలంగాణలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలో 124 మండలాల్లో వడగాల్పులు
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
Srikakulam Crime News: నువ్వంటే నాకిష్టం.. ఇంటికి వచ్చెయ్, అన్నీ షేర్ చేసుకుందాం: విద్యార్థినికి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు
నువ్వంటే నాకిష్టం.. ఇంటికి వచ్చెయ్, అన్నీ షేర్ చేసుకుందాం: విద్యార్థినికి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు
Srisailam News: శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sunil Narine 200 IPL Wickets: సునీల్ నరైన్ చరిత్ర.. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ ప్లేయర్‌గా రికార్డ్!
సునీల్ నరైన్ చరిత్ర.. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ ప్లేయర్‌గా రికార్డ్! KKR బౌలర్ అరుదైన ఘనత
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Bandla Ganesh Daughter Engagement : బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
Beer in Summer : వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
Mumbai Indians Major Record: ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
Embed widget