Siraj Bowling vs RCB IPL 2025 | మియా మావ బౌలింగ్ కి..వణికిపోయిన ఆర్సీబీ
ఐపీఎల్ లో మహ్మద్ సిరాజ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్సీబీ..ఆ తర్వాత విరాట్ కొహ్లీ. కొహ్లీ కి ఆల్మోస్ట్ తమ్ముడిలా..ఆర్సీబీ తురుపు ముక్క లాంటి బౌలర్ గా ఏడేళ్ల పాటు సేవలందించిన సిరాజ్ ను మొన్న ఆక్షన్ లో వదిలించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. యశ్ దయాల్ లాంటి బౌలర్ ను అట్టిపెట్టుకుని తను అవసరం లేదనుకుని ఆర్సీబీ వదిలేసిందని బాధపడ్డాడో ఏమో తనను కొనుక్కున్న గుజరాత్ కి న్యాయం చేసేలా మియా దుమ్ము దుమారమే చేశాడు. . టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న గుజరాత్ నిర్ణయం సరైనదని పించేలా సీమ్ బౌలింగ్ తో ఆర్సీబీకి చుక్కలు చూపించాడు మహ్మద్ సిరాజ్. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 19 పరుగులు మాత్రమే ఇఛ్చి 3 వికెట్లు తీశాడు మియా. వాటిలో సాల్ట్, పడిక్కల్ వికెట్లు అయితే క్లీన్ బౌల్డ్. ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి ఒక్కోడికి. అంతే కాదు హాఫ్ సెంచరీ కొట్టి ప్రమాదకరంగా మారిన లివింగ్ స్టోన్ వికెట్ కూడా తనే తీసి గుజరాత్ టార్గెట్ ఎక్కువగా లేకుండా ఉండేలా చేశాడు సిరాజ్. అది ఫలితాన్ని ఇచ్చింది గుజరాత్ మ్యాచ్ గెలిచేసింది. సిరాజ్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కానీ సిరాజ్ ఇదంతా మనుసులో పెట్టుకుని చేశాడన్నట్లుగా కొన్ని మీమ్స్ ఫన్నీగా వైరల్ చేస్తున్నారు. సిరాజ్ ను మొన్నా మధ్య తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ సర్వీసెస్ లోకి డీఎస్పీ ఉద్యోగం కూడా ఇచ్చింది కదా..సో ఆర్సీబీ దొంగలను అందరినీ పట్టుకుని సిరాజ్ జైలులో వేసినట్లుగా వాళ్లని బంధించినట్లుగా సరదాగా ఫోటోలను షేర్ చేస్తున్నారు. బాహుబలిలో కన్నప్పలా వెన్నుపోటు పొడిచాడని...సింగం సినిమాలో సూర్యలా స్మగర్ ను లాక్కెళ్లినట్లు ఆర్సీబీ లాక్కెళ్లాని చెబుతూ సూపర్ ఫన్ క్రియేట్ చేశారు ఫ్యాన్స్.





















