WhatsApp Blue Ticks: వాట్సాప్‌లో 'బ్లూ టిక్స్' ఎలా ఆఫ్ చేయాలి? మూడంటే మూడే సింపుల్ స్టెప్స్
WhatsApp Blue Tick Off Process: గ్రూప్ చాట్‌లలో బ్లూ టిక్స్‌ను ఆఫ్ చేసే ఛాన్స్ లేదు. కాబట్టి, గ్రూప్‌లోని సందేశాలను మీరు చదివారో, లేదో మెంబర్లకు తెలుస్తుంది.

How to Remove Blue Tick From WhatsApp on Android: వాట్సాప్ అనేది ఒక మెసేజింగ్ ప్లాట్‌ఫామ్. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక పోస్ట్‌మాన్. మన పంపే సందేశాలను అవతలి వాళ్లకు, అవతలి వాళ్లు పంపిన సందేశాలను మనకు క్షణాల్లో చేరవేస్తుంది. స్నేహితులతో సరదాగా ఛాట్ చేయడానికే కాదు, వర్క్ చేసే వాళ్లకు కూడా ఇది చాలా ఉపయోగం. వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి, వాళ్ల పనికి సంబంధించిన అప్‌డేట్స్ పంచుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతోనూ వాట్సాట్ గ్రూప్‌లు ఉంటున్నాయి. ఒక ఊరు లేదా ఒక ప్రాంతం వాళ్లు కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని, ఆ ప్రాంతానికి సంబంధించిన విశేషాలు పంచుకుంటున్నారు. యూపీఐను ఉపయోగించుకుని, వాట్సాప్‌లో డబ్బులు కూడా పంపవచ్చు. ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి కాబట్టి ఇది మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను మించి ఇది పని చేస్తుంది & ప్రపంచ ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగం అయింది.
ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 10 బిలియన్లకు పైగా ఫోన్‌లలో వాట్సాప్ యాప్ డౌన్‌లోడ్ అయింది. అయితే, వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు, కొంతమంది తమ గోప్యత గురించి చాలా ఆందోళన చెందుతారు. కొంతమంది వ్యక్తులు, తాము ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉన్నారో & ఎప్పుడు ఆఫ్‌లైన్‌లో ఉన్నారో ఇతరులకు తెలియకూడదని కూడా కోరుకుంటారు. అంతేకాదు, తమకు వచ్చిన మెసేజ్‌ను చదివామా, లేదా అన్న విషయం మరెవరికీ తెలీకూడదని భావిస్తారు. ఇలాంటి గోప్యత కోసం 'బ్లూ టిక్స్' ఆప్షన్‌ను ఆపేస్తారు.
వాట్సాప్ బ్లూ టిక్స్ అంటే ఏంటి, అవి ఎలా పని చేస్తాయి?
మీరు ఓ వ్యక్తికి పంపిన సందేశం పంపినప్పుడు, ఆ వ్యక్తి ఆ సందేశాన్ని చదివాడా/చూశాడా/విన్నాడా అని మీకు కన్ఫర్మేషన్ వచ్చే మార్గం బ్లూ టిక్స్. మీరు ఒక సందేశాన్ని పంపినప్పుడు, అది ఒక బూడిద రంగు టిక్‌తో ప్రారంభమవుతుంది (సర్వర్‌కు డెలివరీ అవుతుంది). అవతలి వ్యక్తి ఫోన్‌లోకి చేరితే రెండు బూడిద రంగు టిక్‌లుగా మారుతుంది. సందేశ గ్రహీత దానిని తెరిచినప్పుడు ఆ రెండు బూడిద రంగు టిక్స్ బ్లూ కలర్‌లోకి మారతాయి. అవే బ్లూ టిక్స్.
వాట్సాప్‌లో బ్లూ టిక్‌లను ఎందుకు డిసేబుల్ చేయాలి?
- జవాబు ఇవ్వడానికి కొంత సమయం అవసరమైనప్పుడు. మీరు వెంటనే స్పందించలేదన్న ఒత్తిడి మీ మీద ఉండదు.
- పంపినవారికి తెలియజేయకుండా ఆ సందేశాన్ని చదవాలనుకున్నప్పుడు. ఇది మీ గోప్యతను కాపాడుతుంది.
- ఎవరైనా తక్షణ సమాధానం ఆశించినప్పుడు, తక్షణం స్పందించే పరిస్థితిలో మీరు లేనప్పుడు. దీనివల్ల ఉద్రిక్తతలు తగ్గుతాయి.
- అదనపు జవాబుదారీతనం లేకుండా సంభాషణల్లో పాల్గొనాలని భావించినప్పుడు.
WhatsApp బ్లూ టిక్‌లు డిజేబుల్ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి
- మీరు బ్లూ టిక్స్ ఆఫ్ చేసినప్పుడు, మీరు పంపే సందేశాలకు కూడా బ్లూ టిక్‌లు చూడలేరు. అంటే, అవతలి వ్యక్తి మీ సందేశాన్ని ఓపెన్ చేశాడో, లేదో మీకు తెలీదు.
- మీకు వచ్చిన సందేశాలను విస్మరిస్తున్నారని కొంతమంది అనుకోవచ్చు. ఇది అనవసర అపార్థాలకు దారి తీయవచ్చు.
వాట్సాప్‌లో బ్లూ టిక్‌ను ఎలా ఆఫ్ చేయాలి? (How to Remove Blue Tick From WhatsApp on Android)
వాట్సాప్‌లో బ్లూ టిక్‌ను ఆఫ్ చేసే ప్రక్రియ చాలా సులభం.
1. వాట్సాప్ బ్లూ టిక్‌ను ఆఫ్ చేయడానికి, ముందుగా యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.
2. ఆ తర్వాత Privacy మీద క్లిక్ చేయండి.
3. ఇప్పుడు, Read Receipts ఆప్షన్‌లోకి వెళ్లి, దానిని ఆఫ్ చేయండి. అంతే, బ్లూ టిక్స్ డిజేబుల్ అవుతాయి.
బ్లూ టిక్‌లను తొలగించడం వల్ల ఇతర ఫీచర్లు ప్రభావితం అవుతాయా?
బ్లూ టిక్‌లను ఆఫ్ చేయడం అనేది గోప్యత పరమైన సర్దుబాటు. ఇది WhatsApp పనితీరుపై ప్రభావం చూపదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

