Mobile Blast : ఫోన్ కవర్లో డబ్బులు, ఏటీఎం కార్డులు పెడుతున్నారా? అయితే జాగ్రత్త, ముఖ్యంగా సమ్మర్లో
Phone Case Risks : ఫోన్ అందరి లైఫ్‌లో కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే కొందరు తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల ఫోన్ వాడకం మరింత ప్రమాదంగా మారుతుంది. ఇంతకీ ఆ తప్పులు ఏంటో చూసేద్దాం.

Mobile Saftey Tips : స్మార్ట్ ఫోన్స్‌ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వినియోగిస్తున్నారు. ఉదయం నిద్ర లేచినప్పటినుంచి రాత్రుళ్లు నిద్ర ఆపుకొని మరీ ఫోన్స్ చూసేవారు ఉంటారు. ఇంతిలా జీవితంలో అంతర్భాగమైన ఫోన్ విషయంలో తెలిసి తెలిసి కొందరు తప్పులు చేస్తారు. ఫోన్ సేఫ్టీ కోసం మొబైల్ పౌచ్‌లు ఉపయోగిస్తారు. కానీ దానిలో డబ్బులు, ఏటీఎం కార్డులు వంటివి పెడతారు. ఇది ఎంత ప్రమాదమో తెలుసా? ముఖ్యంగా సమ్మర్లో ఇలాంటి తప్పులు అసలు చేయవద్దంటున్నారు నిపుణులు.
డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ ప్రజల జీవితాల్లో ఓ ముఖ్యమైన భాగమైపోయింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ని మరింత స్మార్ట్‌గా వాడాలని.. దాని పౌచ్‌ని పర్స్‌గా మార్చేస్తున్నారు. ఫోన్‌కి, పోచ్కి మధ్యలో డబ్బులు పెట్టి అవసరానికి ఉపయోగపడతాయని చెప్తున్నారు. అలాగే ఏటీఎం కార్డ్‌లను కూడా చాలామంది పౌచ్‌లో పెట్టేస్తారు. ఇలా చేయడం ఎంత డేంజరో తెలుసా? ముఖ్యంగా సమ్మర్లో ఇలాంటి పనులు అస్సలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అసలు ఫోన్ పౌచ్‌లో డబ్బులు, కార్డులు ఎందుకు పెట్టకూడదో ఇప్పుడు చూసేద్దాం.
నష్టం తప్పదు..
సమ్మర్లో ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాలు వేడెక్కడం, పేలిపోవడం వంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కాలిపోతూ ఉంటాయి. ఇలా జరగడానికి వివిధ కారణాలు ఉంటాయి. స్మార్ట్ఫోన్లు కూడా నిర్లక్ష్యంగా వాడితే ఇలాగే పేలిపోతాయని చెప్తున్నారు నిపుణులు. ఫోన్ కవర్లో డబ్బులు, కార్డులు, ఇతర కాగితాలు పెడితే తీవ్రమైన నష్టాన్ని చూడాల్సి వస్తుందని చెప్తున్నారు.
ఫోన్స్ పేలిపోతాయట..
స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు వేడిగా మారుతుంది. ఎక్కువగా ఉపయోగించినా.. ఛార్జింగ్‌లో ఎక్కువసేపు ఉంచినా ఫోన్ వేడెక్కుతుంటుంది. సమ్మర్లో ఎక్కువ బయట ఉన్నా కూడా ఫోన్ వేడిగా మారుతుంది. అలాంటి సమయంలో మీ ఫోన్ పౌచ్‌లో డబ్బులు లేదా ఇతర నోట్లు ఉంటే.. అది ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే.. ఫోన్లోని వేడి బయటకు వెళ్లకుండా డబ్బులు, కార్డులు అడ్డుకుంటాయి. దీనివల్ల వేడి పెరిగి మొబైల్పేలిపోయే ప్రమాదం ఉంది.
నెట్వర్క్ సమస్యలు తప్పవు..
ఫోన్లో గేమ్‌లు ఆడేప్పుడు వీడియో స్ట్రీమింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాసెసింగ్ ఎక్కువగా చేసినప్పుడు కూడా మొబైల్‌నుంచి వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో కూడా ఫోన్ కూల్ అవ్వడం కష్టమవుతుంది. ఆ సమయంలో ఫోన్ పేలిపోవడమే కాకుండా.. పేలకపోయినా.. దాని పనితీరుపై ప్రభావం ఉంటుంది. ఫోన్ కవర్లో ఏమైనా ఉంచితే అది యాంటెన్నాపై కూడా ప్రభావం చూపిస్తుంది. సిగ్నల్స్ వీక్ చేస్తుంది. కాల్ డ్రాప్‌లకు, ఇంటర్నెట్ స్లోగా వచ్చేలా చేస్తుంది. లో నెట్వర్క్ కవరేజ్‌లో ఉంటుంది.
బ్యాటరీ డౌన్..
అధిక వేడి వల్ల ఫోన్ బ్యాటరీపై నెగిటివ్ ప్రభావం ఉంటుంది. ఇది బ్యాటరీ త్వరగా పాడైపోయేలా చేస్తుంది. దీనివల్ల మొబైల్ పేలిపోవచ్చు. లేదా బ్యాటరీ త్వరగా డౌన్ అయిపోవచ్చు. అలాగే మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఎప్పుడూ ఉపయోగించకూడదని చెప్తున్నారు. ఇది కూడా మొబైల్ పేలిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.
నివారించడానికి..
ఫోన్ కవర్లో ఎలాంటి నోట్స్, కార్డులు ఉంచకూడదు. ముఖ్యంగా వేసవికాలంలో ఫోన్‌ను చల్లని లేదా గాలి వచ్చే ప్రదేశంలో ఉంచాలి. సూర్యాకాంతి నేరుగా పడే దగ్గర ఫోన్‌ని ఉంచకూడదు. దీనివల్ల డివైస్ హీట్ ఎక్కుతుంది. అలాగే ఫోన్‌ని కంటిన్యూగా ఎక్కువసేపు వినియోగించకుండా బ్రేక్స్ ఇవ్వాలి. ఫోన్ వేడిగా ఉన్నప్పుడు ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఇలా చేయడం వల్ల డివైస్ మన్నిక కూడా పెరుగుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

