అన్వేషించండి

Rammohan Naidu: ఇండిగో తరహా సంక్షోభాలు భవిష్యత్ లో రాకుండా కఠినచర్యలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

Indigo: ఇండిగో తరహా సంక్షోభాలు రాకుండా కఠిన చర్యలు తీసుకోబోతున్నామని రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఓ టీవీచానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కీలక వివరాలు వెల్లడించారు.

Strict measures to prevent Indigo like crises in the future:   ఇండిగో సంక్షోభం వల్ల లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని ఇలాంటివి ఇక ముందు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆజ్‌తక్ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సంక్షోభం ప్రయాణికులకు  తీవ్రమైన  అసౌకర్యాన్ని కలిగించిందని..  దీన్ని ఓ కేస్ స్టడీగా తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

 ఇండిగో ఎయిర్‌లైన్స్ గత వారంలో తీవ్ర సంక్షోభానికి గురైంది. దాదాపు 1,600 ఫ్లైట్లు అకస్మాత్తుగా రద్దు అయ్యాయి.  ఇది లక్షలాది ప్రయాణికులను  ఇబ్బంది పెట్టింది.  ఈ సంక్షోభానికి కారణం ఇండిగో  వైఫల్యమేనని మంత్రి స్పష్టంచేశారు.   ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలకు ఇండిగో అనుగుణంగా పనిచేయలేదని, ఇది పైలట్లు, క్రూ మెంబర్లు, ప్రయాణికులకు సమస్యగా మారిందన్నారు.  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)తో రెండు రోజుల ముందు ఇండిగో ప్రతినిధులు  సమావేశమై, FDTL సమస్యలు లేవని హామీ ఇచ్చారు. కానీ రెండు రోజుల్లోనే సమస్య తీవ్రం అయింది అని మంత్రి తెలిపారు.  అంటే ఇండిగో సమస్యలను దాచి పెట్టిందని తెలిపారు. ఇండిగో వల్ల  ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం, ప్రయాణికుల అసౌకర్యం ఏర్పడ్డాయి.

మంత్రి రామ్ మోహన్ నాయుడు తనపై వస్తున్న విమర్శను తిప్పికొట్టారు.  ఇండిగో   ప్లానింగ్ లేకపోవడం,  , FDTL నిబంధనలకు ఉల్లంఘనలే ఈ సంక్షోభానికి కారణం. మేము రోజూ ఇండిగో ఆపరేషన్లు పరిశీలించాలా అని ప్రశ్నించారు.   రెగ్యులేటర్‌గా సురక్షా ప్రమాణాలు నిర్ధారించడమే  తమ  బాధ్యత అని  స్పష్టం చేశారు.  FDTL నిబంధనలు  పైలట్లు, క్రూ, ప్రయాణికుల భద్రత కోసమే.   మేముభద్రత గురించే ఆలోచిస్తాం అని స్పష్టం చేశారు. ఇండిగో ప్రభుత్వాన్ని మోసం చేసిందా లేదా అన్నదానిపై దర్యాప్తు జరుగుతోందన్నారు.ల  ఇది ప్రభుత్వం, ఎయిర్‌లైన్ మధ్య యుద్ధం కాదు, ప్రయాణికుల సమస్య అని స్పందించారు.  ఇది ఉద్దేశపూర్వకంగా జరిగితే.. తీవ్ర చర్యలు తప్పవని ఇండిగో సీఈవోకు హెచ్చరికలు జారీ చేశారు.  

ప్రభుత్వం ఈ సంఘటనపై వెంటనే చర్యలు ప్రారంభించింది. DGCAతో ఇండిగో సమావేశాలు జరిగినప్పటికీ సమస్యలు దాచిపెట్టినట్టు అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ మొత్తం విషయంపై పరిశోధన ప్రారంభించామని.  ఎలా జరిగింది, ఎందుకు రిపోర్ట్ చేయలేదో తెలుసుకుంటామని  మంత్రి ప్రకటించారు. రాతపూర్వకంగా విచారణ జరుగుతుందని, ఆపరేషన్లు స్థిరపడే వరకు పరిశీలిస్తామని తెలిపారు. ఇతర ఎయిర్‌లైన్‌లు FDTL నిబంధనలకు కట్టుబడి ఉన్నాయని, ఇండిగో మాత్రమే ఉల్లంఘించిందని నొక్కి చెప్పారు. మంత్రి రామ్ మోహన్ నాయుడు, ఇలాంటి సంక్షోభాలు మళ్లీ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.    FDTL నిబంధనల అమలును మరింత కఠినతరం చేస్తామని, అంతా స్థాక్‌హోల్డర్లతో సంప్రదించి భద్రతా ప్రమాణాలు మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రయాణికులకు భద్రత, స్థిరత్వం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ సంక్షోభం భారత విమానయాన రంగంలో నియంత్రణ పరిధిని ప్రశ్నార్థకం చేసింది. DGCA సురక్షా ప్రమాణాలు నిర్ధారించడమే, రోజువారీ ఆపరేషన్లు పరిశీలించడం కాదని మంత్రి వివరించారు. ప్రయాణికులు ఎయిర్‌లైన్‌లపై ఆధారపడి ఉన్నారని, ప్రభుత్వం వారిని రక్షించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇండిగో ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘించిందా అనే అనుమానాలు, బాధ్యతలపై చర్చలకు దారితీశాయి. ఈ సంఘటన భవిష్యత్తులో ఎయిర్‌లైన్‌ల అధికారికతను పెంచుతుందని అభిప్రాయాన్ని రామ్మోహన్ నాయుడు వ్యక్తం చేశారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
Telangana DCA: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Advertisement

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
Telangana DCA: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Abhishek Sharma : అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Bangladesh: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
Embed widget