Ram Charan: 'చిరుత' నుంచి 'పెద్ది' వరకు... రామ్ చరణ్ సినిమాల ఆడియో రైట్స్ - లిస్ట్‌లో టాప్ ఏది? లాస్ట్ ఏదో తెలుసా?
Ram Charan Movies Audio Rights : రామ్ చరణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఆడియో రైట్స్ పలికిన మూవీగా 'పెద్ది' రికార్డ్ క్రియేట్ చేసింది. మరి అతి తక్కువ ధరకు ఆడియో రైట్స్ పలికిన చెర్రీ మూవీ ఏంటో తెలుసా ?

Ram Charan Movies Audio Rights: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. చెర్రీ కెరీర్‌లో 16వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇక ఈ ఫస్ట్ లుక్ ఎఫెక్ట్‌తో 'పెద్ది' ఆడియో రైట్స్ రామ చరణ్ కెరియర్‌లోనే హయ్యెస్ట్ ధరకు పలకడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ కెరీర్‌లో 'చిరుత' నుంచి ఇప్పటిదాకా ఆయన నటించిన సినిమాల ఆడియో రైట్స్ ఎంతకు పలికాయి? అందులో తక్కువ ధర పలికిన సినిమా ఏంటి? అనే చర్చ మొదలైంది.
చెర్రీ మూవీ ఆడియో రైట్స్... లిస్ట్‌లో టాప్, లాస్ట్ ఏవో తెల్సా?
రామ్ చరణ్ మెగాస్టార్ వారసుడిగా, హీరోగా 'చిరుత' సినిమాతో టాలీవుడ్లో కెరియర్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఫస్ట్ మూవీతోనే ఆయన విమర్శలు అందుకున్నప్పటికీ, ఈ మూవీ ఆడియో రైట్స్ అప్పట్లోనే రూ.80 లక్షలు పలకడం సంచలనం సృష్టించింది. తర్వాత చెర్రీ కెరీర్ మలుపు తిప్పిన మూవీ 'మగధీర'. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీ ఆడియో రైట్స్ రూ.కోటి అమ్ముడయ్యాయి. ఇక ఇక్కడి నుంచి చెర్రీ కెరీర్‌లో ఎత్తు పల్లాలు మొదలయ్యాయి.
'ఆరెంజ్' బాక్సాఫీస్ రిజల్ట్ అందరికీ తెలిసిందే. అయితే, ఆ సినిమాలో సాంగ్స్ బ్లాక్ బస్టర్. ఆ మూవీ ఆడియో రైట్స్‌కు రూ. 1.25 కోట్లకు అమ్ముడు అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన 'రచ్చ' రూ.75 లక్షలు, 'నాయక్' రూ.77 లక్షలు, 'గోవిందుడు అందరివాడేలే' రూ.80 లక్షలు, 'బ్రూస్ లీ'కి రూ.85 లక్షల డీల్స్ సెట్ అయ్యాయి. 'ధృవ' రూ.1 కోటి, రంగస్థలం రూ.1. 35 కోట్లు, వినయ విధేయ రామ రూ.1.5 కోట్లు, గేమ్ ఛేంజర్ రూ.25 కోట్ల ఆడియో రైట్స్ బిజినెస్ జరిగింది.
'ఆరెంజ్' ఎఫెక్ట్ నెక్స్ట్ మూవీపై...
ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా ఆడియో రైట్స్ డీల్ రూ. 35 కోట్లకు సెట్ కావడం విశేషం. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఆయన ఇప్పటిదాకా నటించిన సినిమాలలో అతి తక్కువ ధరకి ఆడియో డీల్ సెట్ అయిన మూవీ 'రచ్చ'. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో సాంగ్స్ ఏ రేంజ్‍లో దుమ్మురేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ అంతకుముందు వచ్చిన 'ఆరెంజ్' మూవీ డిజాస్టర్ కావడంతో ఆ ఎఫెక్ట్ 'రచ్చ' మూవీపై పడింది. అయితేనేం రామ్ చరణ్ ఏమాత్రం డీలా పడకుండా ముందుకు సాగారు. ఫలితంగా ఈరోజు 'పెద్ది' మూవీ ఆడియో రైట్స్‌కు రూ. 35 కోట్ల భారీ డీల్ సెట్ కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ మూవీ ఆడియో రైట్స్‌ని టీ సిరీస్ సొంతం చేసుకుంది.
ఇదిలా ఉండగా రామ్ చరణ్, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'పెద్ది'. ఆస్కార్ విన్నర్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ టైటిల్ 'పెద్ది' అనౌన్స్మెంట్‌కు ముందే లీక్ అయ్యింది. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న ఈ సినిమా ఫస్ట్ షాట్ రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. దాని గురించే మెగా అభిమానులు ఇప్పుడు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వి కపూర్ రొమాన్స్ చేయబోతోంది. ఇందులో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతిబాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలకపాత్ర పోషిస్తున్నారు.





















