అన్వేషించండి
Budget 2023: సెక్షన్ 80టీటీబీ కింద మరో రూ.50వేలు పన్ను ఆదా! బడ్జెట్‌లో లక్షకు పెంచాలని డిమాండ్!
Budget 2023: సెక్షన్ 80టీటీబీ కింద మరో రూ.50వేలు పన్ను ఆదా! బడ్జెట్‌లో లక్షకు పెంచాలని డిమాండ్!

బడ్జెట్ 2023,
1/6

ఆదాయ పన్ను మినహాయింపులు అనగానే అందరికీ గుర్తొచ్చేది సెక్షన్ 80సీ. ఎన్ని స్కీములు ఉపయోగించుకున్నా దీని పరిమితి రూ.1.5 లక్షలు దాటదు. అందుకే ఇవి కాకుండా ఇంకేవైనా డిడక్షన్లు లభించే సెక్షన్ల కోసం చాలా మంది శోధిస్తుంటారు. మీరూ ఈ కోవకే చెందితే ఈ వార్త మీ కోసమే!
2/6

బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న సొమ్ముపై వచ్చే వడ్డీని ఆదాయ పన్ను రిటర్నులో మినహాయించుకోవచ్చు. ఇందుకోసం సెక్షన్ 80టీటీఏ, సెక్షన్ 80టీటీబీ ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా సెక్షన్ 80టీటీఏ ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ సెక్షన్ 80టీటీబీ వాడుకోవాలంటే మీ వయసు 60 ఏళ్లు దాటాలి.
3/6

సెక్షన్ 80టీటీఏ కింద ఏడాదికి రూ.10,000 వరకు మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్యాంకు సేవింగ్స్ ఖాతాలు, పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలు, కో ఆపరేటివ్ సొసైటీ సేవింగ్స్ ఖాతాలు దీని పరిధిలోకి వస్తాయి. ఒక ఏడాదిలో ఈ ఖాతాలో దాచుకున్న సొమ్ముపై వచ్చే వడ్డీ పదివేల వరకు డిడక్షన్ పొందొచ్చు.
4/6

పైన చెప్పిన సేవింగ్స్ ఖాతాలన్నీ సెక్షన్ 80టీటీబీ పరిధిలోకీ వస్తాయి. అయితే సీనియర్ సిటిజన్లకు మాత్రమే దీని కింద రూ.50వేల వరకు మినహాయింపు లభిస్తుంది. అన్ని ఖాతాలపై వచ్చే వడ్డీ మొత్తాన్ని ఇందులో చూపించుకోవచ్చు.
5/6

మీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే సెక్షన్ 80సీ రూ.1.5 లక్షలకు అదనంగా మరో పదివేల రూపాయిలను మినహాయించుకోవచ్చు. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ అయితే రూ.1.5 లక్షలకు అదనగా మరో రూ.50వేల వరకు ఉపశమనం దొరుకుతుంది.
6/6

ప్రస్తుతం ఆర్బీఐ రెపోరేట్లు సవరిస్తుండటంతో ఖాతాదారులకు ఎక్కువ వడ్డీ వస్తోంది. కానీ పెరిగిన ద్రవ్యోల్బణంతో చేతికందే డబ్బుకు విలువ తగ్గింది. ఈనేపథ్యంలో సెక్షన్ 80 టీటీబీ పరిమితిని రూ.లక్షకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
Published at : 24 Jan 2023 12:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion