Aadi Saikumar: ఆది సాయికుమార్ సినిమాకు రిలీజ్‌కు ముందే ఆరేడు కోట్లు... 'ఎస్ఐ యుగంధర్' డిజిటల్ డీల్ క్లోజ్, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?
SI Yugandhar : 'ఎస్ఐ యుగంధర్' డిజిటల్ డీల్ క్లోజ్ అయ్యింది. యంగ్ హీరో ఆది సాయి కుమార్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ధరకు ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన 'ఎస్ఐ యుగంధర్' మూవీ డిజిటల్ డీల్ క్లోజ్ అయ్యింది. ఫ్యాన్సీ ధరకు ఈ మూవీ రైట్స్ అమ్ముడు పోవడంతో, ఆయన కెరీర్ లోనే అత్యుత్తమ డిజిటల్ డీల్ గా రికార్డును క్రియేట్ చేసింది.
ఫ్యాన్సీ ధరకు 'ఎస్ఐ యుగంధర్' డిజిటల్ రైట్స్
ఆది సాయికుమార్ హీరోగా 'ఎస్ఐ యుగంధర్' అనే మూవీ తెరకెక్కుతోంది. యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మేఘలేఖ హీరోయిన్ గా, రాకేందు మౌళి విలన్ గా నటిస్తున్నారు. శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ జూలూరు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2024 చివర్లో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్లో మూవీ పూజా కార్యక్రమాలు జరగగా, తొలి సన్నివేశానికి మరో హీరో సందీప్ కిషన్ క్లాప్ ఇచ్చారు. ఆది సాయికుమార్ తండ్రి సాయికుమార్ స్క్రిప్ట్ అందించారు. అప్పటి నుంచి ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ మూవీని ఇదే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు.
Also Read: బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!
ఈ ఓటీటీ చేతిలోనే 'ఎస్ఐ యుగంధర్' రైట్స్
'ఎస్సై యుగంధర్' మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచే పాజిటివ్ బజ్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ మంచి ధరకు కుదిరినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం 'ఎస్సై యుగంధర్' మూవీ ఓటీటీ రైట్స్ దాదాపు రూ. 7 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. నిజానికి ఇది ఆది కెరియర్ లోనే బెస్ట్ ఓటీటీ డీల్ అని చెప్పొచ్చు. ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. మూవీ థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
భారీ ధరకు శాటిలైట్ హక్కులు
కేవలం ఓటీటీ డీల్ మాత్రమే కాకుండా 'ఎస్ఐ యుగంధర్' శాటిలైట్ రైట్స్ కూడా ఫ్యాన్సీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకోగా, శాటిలైట్ రైట్స్ ని కూడా ఈటీవీ రూ. 4 కోట్ల రూపాయలకు చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ మరో రూ. 4 కోట్ల రూపాయల వరకు రాబట్టింది. ఇక టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమాలో ఆది సాయికుమార్ ఎస్ఐ యుగంధర్ అనే సబ్ ఇన్స్పెక్టర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు పి మార్కస్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయబోతున్నారు. అందులో భాగంగా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ మూవీ పైనే ఆది సాయి కుమార్ ఆశలన్నీ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో షణ్ముఖ, జంగల్, కిరాతక, అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్ 1 వంటి క్రేజీ సినిమాల లైనప్ ఉంది.
Also Read: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

