అన్వేషించండి

With Love OTT : ఓటీటీలోకి హిట్ బొమ్మ 'విత్ లవ్' - రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

With Love OTT Platform : రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'విత్ లవ్' ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Abishan Jeevinth's With Love OTT Release Date Locked : చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ కొట్టిన రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'విత్ లవ్'. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఐదు రోజుల్లోనే రూ.10 కోట్ల క్లబ్‌లో చేరింది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'విత్ లవ్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా... మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేకపోయినా కంటెంట్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. 

ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించగా... సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్యతో కలిసి నజరత్ పసిలియన్, మహేశ్ రాజ్ పసిలియన్ నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అభిషన్, అనస్వర రాజన్‌లతో పాటు కావ్య అనిల్, సచిన్ నాచియప్పన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కేవలం మౌత్ టాక్‌తోనే థియేటర్లలో బిగ్ రెస్పాన్స్ అందుకున్న మూవీ ఓటీటీలో మరింత సక్సెస్ అవుతుందని టీం భావిస్తోంది.

Also Read : విరోష్ కపుల్ గొప్ప మనసు - ఫ్యాన్స్‌కు స్వీట్ సర్‌ప్రైజ్... ఆలయాల్లో అన్నదానం కూడా...

స్టోరీ ఏంటంటే?

డిజైనర్ అయిన సత్య (అభిషన్ జీవంత్) పెళ్లి చూపులకు వెళ్తాడు. పెళ్లి కూతురు స్కూల్‌లో తనకు రెండేళ్ల జూనియర్ మనీషా (అనస్వర రాజన్) అని తెలుస్తుంది. దీంతో ఇద్దరూ తమ పాత స్నేహాలను, లవ్ స్టోరీస్ గుర్తు చేసుకుంటారు. స్కూల్ డేస్‌లో అనీషా (కావ్య అనిల్)ను సత్య, బాలాజీ (సచిన్ నాచియప్పన్)ను మనీషా ఇష్టపడతారు. అయితే, తమ ప్రేమ విషయం ఎవరికి వారే మనసులో దాచుకుంటారు. ఇప్పుడు అనీషా, బాలాజీ ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వాళ్ల దగ్గరకు వెళ్లి అసలు విషయం చెప్పాలనుకుంటారు.

ఆ తర్వాత ఏం జరిగింది? సత్య, మనీషా పెళ్లి చూపులు ఏమయ్యాయి? తాము ప్రేమించిన వారికి అసలు విషయం చెప్పారా? వీరి మధ్య ప్రేమ చిగురించిందా? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Embed widget