Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - ఫ్యాన్స్‌కు స్వీట్ సర్‌ప్రైజ్... ఆలయాల్లో అన్నదానం కూడా...
Virosh Wedding : విరోష్ కపుల్ తమ గొప్ప మనసు చాటుకున్నారు. వెడ్డింగ్ తర్వాత ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. దీంతో పాటే ప్రధాన ఆలయాల్లో అన్నదానం చేయనున్నారు.

Vijay Deverakonda Rashmika Mandanna Couple Surprise To Fans : స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక కపుల్ తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు. తమ వెడ్డింగ్ గిఫ్ట్‌గా తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు ఏపీ, తెలంగాణలో స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. దీంతో పాటే ప్రముఖ దేవాలయాల్లో అన్నదానం కూడా ప్లాన్ చేశారు.
ప్రముఖ ఆలయాల్లో...
ఈ నెల 26న రాజస్థాన్ ఉదయపూర్‌లో విరోష్ కపుల్ వివాహం ఘనంగా జరిగింది. ఉదయం హిందూ సంప్రదాయం ప్రకారం ఈవినింగ్ కడువ సంప్రదాయం ప్రకారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శనివారం ఉదయపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు స్వీట్స్ పంచాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రముఖ ఆలయాల్లో అన్నదానం కూడా చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు.
'దేశంలోని ప్రజలు ఎల్లప్పుడూ మా ప్రయాణంలో, ప్రేమలో భాగమయ్యారు. మా పెళ్లిని మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా మాకు సంతోషం కలిగిస్తుంది. మా లైఫ్‌లో ఇంత పెద్ద మూమెంట్‌ను మీతో పంచుకోవడానికి స్వీట్స్, ప్రేమ నిండిన ట్రక్కులను దేశవ్యాప్తంగా మార్చి 1న పంపిస్తున్నాం. అలాగే దేశంలోని కొన్ని దేవాలయాల్లో అన్నదానం చేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.' అంటూ విరోష్ జోడీ రాసుకొచ్చారు.


Also Read : దుబాయ్‌లో హీరో విష్ణుకు భయానక అనుభవం - శాంతి కోసం ప్రార్థిసున్నామంటూ...
తెలుగు రాష్ట్రాల్లో...
ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, యూపీ, అస్సాం, గుజరాత్, చండీగఢ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని ఆలయాల్లో ఈ అన్నదానం జరగనుంది. ఏపీలోని శ్రీ కనకమహాలక్ష్మి టెంపుల్ (వైజాగ్), ద్వారకా తిరుమల టెంపుల్ (ఏలూరు), శ్రీకనకదుర్గ టెంపుల్ (విజయవాడ)... తెలంగాణలో సాయిబాబా టెంపుల్ (చింతపల్లి), మన్యంకొండ శ్రీలక్ష్మి వెంకటేశ్వర టెంపుల్ (మహబూబ్ నగర్), హరే కృష్ణ హెరిటేజ్ టెంపుల్ (హైదరాబాద్) ఆలయాల్లో అన్నదానం చేయనున్నారు.
స్వీట్స్ పంపిణీ
ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, బీహార్, ఛండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరిలో ఫ్యాన్స్‌కు విరోష్ కపుల్ స్వీట్స్ పంచనున్నారు. ఏపీలోని వైజాగ్, విజయవాడ, పుట్టపర్తి నగరాల్లోనూ... అటు తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్‌కు స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.
హైదరాబాద్‌లో రిసెప్షన్
హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌లో ఈ నెల 4న విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్ హాజరు కానున్నారు. హైదరాబాద్ రావడానికి ముందు విరోష్ కపుల్ ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి వివాహ రిసెప్షన్‌కు హాజరు కానున్నారు.
























