Sreeleela: బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!
Sreeleela First Bollywood Movie: యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. కార్తీక్ ఆర్యన్‌తో జంటగా శ్రీలీల ఈ మూవీలో గ్లామర్ డోస్ పెంచేసినట్లు తెలుస్తోంది.

Sreeleela Bollywood First Movie First Look: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela).. తన అందం, అభినయం, డ్యాన్స్‌తో అదరగొడుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో సైతం నటించి మెప్పించారు. మొన్నటి వరకూ తెలుగులో వరుస విజయాలు అందుకున్న ఆమె ప్రస్తుతం కాస్త జోరు తగ్గిందనే చెప్పాలి. అయితే, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు శ్రీలీల. ఇక తాజాగా.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో సినిమా చేస్తున్నారు. కార్తీక్, శ్రీలీల జంటగా నటించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ వచ్చేసింది. ఈ మేరకు మూవీ టీం స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది.
రొమాన్స్ డోస్ పెంచేసిందిగా..
ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్ (Kartikaaryan) సింగర్‌గా నటిస్తుండగా.. అతని లవర్ పాత్రలో శ్రీలీల నటిస్తున్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. కార్తీక్ తొలుత గిటార్ వాగిస్తూ స్టేజ్‌పై పాట పాడుతుండగా.. వీరిద్దరి మధ్య రొమాంటిక్ మూమెంట్స్ సైతం ఉన్నాయి. శ్రీలీల కాస్త గ్లామర్ డోస్ పెంచినట్లు కనిపిస్తుండగా.. ఫస్ట్ లుక్ టీజర్‌లోని పాట మెలోడీ ట్యూన్‌తో ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి ప్రీతమ్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఈ సాంగ్‌ను విశాల్ మిశ్రా పాడారు. డైరెక్టర్ అనురాగ్ బసు ఈ మూవీని రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా యూత్‌ను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: మెగా మేనల్లుడితో పాటు 'విశ్వంభర'లో మరో మెగా సెలబ్రిటీ - ఇంట్రో సాంగ్ మామూలుగా ఉండదు మరి
ఆ రూమర్స్ నిజమేనా..
ఈ చిత్రానికి మేకర్స్ ఇంకా టైటిల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. అయితే, బాలీవుడ్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటైన 'ఆషికి' ఫస్ట్ పార్ట్ 1990లో రాగా సూపర్ హిట్‌గా నిలిచింది. అనంతరం 2013లో ఆషికి 2 రాగా.. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. ఆషికి 2 వచ్చిన దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. మూడో భాగంగా ఈ సినిమా వస్తుందని రూమర్స్ వచ్చాయి. ఆషికి 2 స్టైల్‌లో మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగానే ఈ మూవీ ఉండనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృషన్ కుమార్ నిర్మిస్తున్నారు.
వరుస చిత్రాలతో శ్రీలీల బిజీ బిజీ
టాలీవుడ్‌లో యంగ్, స్టార్ హీరోలతో చేసి కొన్ని హిట్లు అందుకున్న శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. కార్తీక్ ఆర్యన్ సినిమాతో పాటు సైఫ్ ఆలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో ఓ మూవీలో హీరోయిన్‌గా చేయనున్నారు. ఇక, తెలుగు సినిమాల విషయానికొస్తే.. శ్రీలీల, నితిన్ జంటగా నటించిన 'రాబిన్ హుడ్' మార్చి 28న థియేటర్లలోకి రానుంది. అలాగే, మాస్ మహారాజా రవితేజ సరసన 'మాస్ జాతర', తమిళంలో శివ కార్తికేయన్ 25వ సినిమా 'పరాశక్తి'లోనూ శ్రీ లీల ఉన్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ మంచి బజ్ తెచ్చింది. అఖిల్ అక్కినేని కొత్త సినిమాలోనూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో కూడా శ్రీ లీల నటిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి శ్రీలీల నటించిన 'గుంటూరు కారం' విడుదలై ఓకే అనిపించుకుంది. ‘పుష్ప 2’ లోని కిస్సిక్ పాటతో మరోసారి యూత్‌ను అలరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

