Prabhas Look From Kannappa | కన్నప్ప సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ | ABP Desam
మంచు విష్ణు ప్రతిష్ఠాత్మంగా తీస్తున్న సినిమా కన్నప్ప. ప్రపంచవ్యాప్తంగా అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న కన్నప్ప సినిమాపై అందరి ఆసక్తి నెలకొనటానికి కారణాల్లో ఒకటి. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేయటమే. తొలుత శివుడు ప్రభాసే అనుకున్నా తర్వాత అక్షయ్ కుమార్ ను శివుడిగా చూపిస్తూ లుక్ రిలీజ్ చేశారు. సో ప్రభాస్ కు నంది క్యారెక్టర్ ఇచ్చారనే టాక్ నడిచింది. అయితే ఈ రోజు ప్రభాస్ ఫస్ట్ లుక్ ను ఎండ్ పేరు ను అనౌన్స్ చేశారు. కన్నప్పులో రుద్రగా నటిస్తున్నారు ప్రభాస్. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు రుద్ర అంటూ పోస్టర్ లో రాసుకొచ్చారు. ప్రభాస్ గెటప్ లో శైవత్వం ఉట్టి పడుతోంది. నుదుటన మూడు నామాలు, మెడలో రుద్రాక్ష మాలలు, చేతిలో కపాల దండం తో స్మశాన వాసిగా అంతకు మించి ప్రమథ గణాల్లో ఓ శక్తిగా ప్రభాస్ కనిపించే అవకాశం ఉన్నట్లైతే లుక్ చూస్తే అర్థమవుతోంది. కానీ మంచు విష్ణు తీసిన ఈ మాగ్నం ఓపన్ చూడాలంటే మాత్రం ఏప్రిల్ 25 రిలీజ్ డేట్ వరకూ ఆగాల్సిందే.





















