అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki  Serial Today March 6th: తన బిడ్డ బతికే ఉందని తెలుసుకున్న ప్రియంవద రియాక్షన్ ఏంటి...? చంపమని ఇచ్చిన బిడ్డను నర్సు ఎవరికి అప్పగించింది...?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode March 6th: తన బిడ్డ బతికే ఉందని తెలుసుకున్న ప్రియంవద రియాక్షన్ ఏంటి...? చంపమని ఇచ్చిన బిడ్డను నర్సు ఎవరికి అప్పగించింది...?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: డబ్బులు కోసం నర్సు పదేపదే బెదిరిస్తుండటంతో ప్రియంవద ఆమెతో కటువుగా మాట్లాడుతుంది. ఎప్పుడో 20ఏళ్ల క్రితం జరిగిన విషయం పట్టుకుని ఇప్పటికీ బెదిరిస్తున్నావని మండిపడుతుంది. డబ్బులు ఇవ్వను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమని అని ఫోన్ పెట్టేయడంతో నర్సుకు ఏం చేయాలో పాలుపోదు. అప్పుడే సరిగ్గా శ్రీలక్ష్మీని చూడటానికి టౌన్‌కు వచ్చిన కోటేశ్వరరావు ఆమె కంటపడతాడు. ఆమెకు వెంటనే గతం గుర్తుకువస్తుంది. 20ఏళ్ల క్రితం తాను చంటిబిడ్డను అప్పగించింది అతనికేనని గుర్తుపట్టేస్తుంది. వెంటనే అతన్ని పట్టుకునేందుకు నర్సు పరుగెత్తుకుంటూ రాగా....కోటేశ్వరరావు ఆటోలో వెళ్లిపోతాడు. చేతికి చిక్కినట్లే చిక్కి మాయమవ్వడంతో నర్సు చాలా బాధపడుతుంది.
 
పెళ్లి ఫొటోలు చూసుకుంటూ శ్రీలక్ష్మీ మురిసిపోవడాన్ని మ్యాడీ చూస్తాడు. ఈ ఫొటోలు అడ్డం పెట్టుకునే కదా నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తోందని అనుకుంటాడు. వీటిని తీసుకుని కాల్చివేస్తేగానీ....శ్రీలక్ష్మీకి బుద్ధిరాదని అనుకుంటూ ఆమె చేతిలో నుంచి ఫొటోలు లాక్కుని పరుగెత్తుతాడు. శ్రీలక్ష్మీ కూడా మధుబాబు వెంటే పరుగెత్తుతుంది. ఇంట్లో అందరూ వాళ్లిద్దరూ సరదాగా ఆడుకుంటున్నారేమో అనుకుంటారు. సరిగ్గా అప్పుడే కోటేశ్వరరావు ఆ ఇంట్లో అడుగుపెట్టి...తన కూతురు ఇంత సంతోషంగా ఉందా ఈ ఇంట్లో అని అనుకుంటాడు.
మ్యాడీ చేతుల్లో ఉన్న ఫొటోలు లాక్కుని శ్రీలక్ష్మీ వాళ్ల నాన్నను కౌగిలించుకుంటుంది.  ఊరి నుంచి చాలా సామాన్లు తీసుకుని వచ్చిన కోటేశ్వరరావును సూర్యనారాయణ కూర్చోమని చెబుతాడు. ఏంటి  ఇలా వచ్చారని అడగ్గా.... హైదరాబాద్‌లో పని ఉండి వచ్చానని ఓసారి శ్రీలక్ష్మీని కూడా చూసినట్లు ఉంటుందని ఇలా వచ్చానని చెబుతాడు. శ్రీలక్ష్మీని చూడటానికి వెళ్తానంటే ఊళ్లో వాళ్లు  పిండివంటలు చేసి ఇచ్చారని చెప్పడంతో...ప్రియంవద అతన్ని హేళన చేస్తుంది. ఊళ్లో వాళ్ల దగ్గర అడుక్కుని తీసుకురావడం ఎందుకు...మీ ఇంట్లో చేసుకుని రాలేరా అని అంటుంది. ఆ మాటలకు సూర్యనారాయణకు కోపం వస్తుంది. కూతురిని గట్టిగా మందలిస్తాడు.
 
శ్రీలక్ష్మీ అంటే మా ఊరిలో అందిరి ఇంట్లో అమ్మాయేనని..అందరూ సొంత కూతురిలా చూసుకుంటారని కోటేశ్వరరావు ప్రియంవదకు చెబుతాడు. అందుకే అందరూ ఆమెకు అన్ని ఇచ్చి పంపించారని చెబుతాడు. నేను వెంటనే వెళ్లిపోతానని అనడంతో రెండురోజులు ఉండిపొమ్మని సూర్యనారాయణ చెబుతాడు. మరోసారి వచ్చినప్పుడు ఉంటానని కోటేశ్వరరావు అంటాడు. అయితే కనీసం మీ అమ్మాయితో  అయినా ప్రశాంతంగా నాలుగు మాటలు మాట్లాడి వెళ్లు అని చెప్పడంతో....తండ్రిని తీసుకుని శ్రీలక్ష్మీ లోపలికి  వెళ్తుంది.
 
ప్రియంవద ఫోన్ లిప్ట్‌ చేయకపోవడంతో నర్సు సరాసరి ఇంటికే వచ్చేస్తుంది. ఆమెను చూసి భయపడిపోయి ఇంటి ముందుకు ప్రియంవద పరుగులు పెడుతుంది.ఇక్కడికి ఎందుకు వచ్చావని నర్సును  నిలదీయగా...మీరు ఫోన్ లిప్ట్ చేయకపోతే ఏం చేయమంటారని అంటుంది. డబ్బులు లేవని చెప్పాను కదా అని ప్రియంవద మండిపడుతుంది. అయినా 20 ఏళ్ల క్రితం చేసిన పని ఇప్పుడు చెబితే మా వాళ్లు నమ్ముతారు అనుకుంటున్నావా అని అంటుంది. మీకు తెలియని నిజం ఒకటి చెబుతానని నర్సు అంటుంది. మీ బిడ్డను చంపేయమని మీరు ఇచ్చారు కానీ...నేను ఆ బిడ్డను చంపలేదని చెప్పడంతో ఆమె షాక్‌ తింటుంది. ఆ పసిబిడ్డను వేరొకరికి పెంచుకోమని ఇచ్చానని ఇప్పుడు అతను నా కంటపడ్డాడని చెప్పడంతో ప్రియంవద కాళ్ల కింద భూమి కంపిస్తుంది.
 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 7th:మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
నువ్వులేక నేను లేను: మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
Podarillu Serial Today August 7th: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ
పొదరిల్లు: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ
Gundeninda Gudigantalu August 7th: తప్పతాగి రోడ్డుమీద గొడవ చేసిన మనోజ్‌...స్టేషన్‌కు తరలించిన అరుణ్‌
గుండెనిండా గుడిగంటలు: తప్పతాగి రోడ్డుమీద గొడవ చేసిన మనోజ్‌...స్టేషన్‌కు తరలించిన అరుణ్‌

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
Embed widget