This Week OTT Movies : రొమాంటిక్ కామెడీ విత్ లవ్ To మూకీ మూవీ గాంధీ టాక్స్ - దిస్ వీక్ ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్ కంప్లీట్ లిస్ట్
OTT Releases : మూకీ సినిమా గాంధీ టాక్స్ నుంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'విత్ లవ్' వరకూ లేటెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్‌లు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.

This Week OTT Releases Web Series Complete List : ప్రతీ వారంలానే ఈ వారం కూడా ఓటీటీల్లో మూవీస్‌తో పాటు వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఫ్యామిలీ డ్రామాతో నుంచి యాక్షన్ సిరీస్‌ల వరకూ ఈ వీకెండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందనుంది. మరి ఓటీటీల్లో వచ్చే ఆ మూవీస్, వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఓసారి చూస్తే...
రొమాంటిక్ ఎంటర్టైనర్ 'విత్ లవ్'
'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'విత్ లవ్'. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ శుక్రవారం నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించగా... అభిషన్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించారు. రజనీకాంత్ కుమార్తె సౌందర్యతో కలిసి నజరత్ పసిలియన్, మహేశ్ రాజ్ పసిలియన్ నిర్మించారు.
తరుణ్ భాస్కర్ 'ఓం శాంతి శాంతి శాంతిః'
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఓం శాంతి శాంతి శాంతిః'. ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించగా... బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, నారిపెద్ది శివన్నారాయణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
మూకీ సినిమా 'గాంధీ టాక్స్'
రీసెంట్‌గా వచ్చిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూకీ మూవీ గాంధీ టాక్స్. కోలీవుడ్ స్టార్స్ విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావ్ హైదరీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో అందుబాటులోకి వచ్చింది. అలాగే, 'ZEE5' వేదికగానూ అందుబాటులోకి వచ్చింది.
Also Read : రణబాలి కొత్త షెడ్యూల్‌కు కొత్త జంట - విజయ్ దేవరకొండ, రష్మిక కపుల్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే?
మూవీస్ / వెబ్ సిరీస్ లిస్ట్
- అమెజాన్ ప్రైమ్ వీడియో - సుబేదార్ (బాలీవుడ్ మూవీ), ఏ లిటిల్ ప్రేయర్ (ఇంగ్లీష్ మూవీ), ది మొమెంట్ (ఇంగ్లీష్ మూవీ), ఏ ప్రైవేట్ లైఫ్ (ఇంగ్లీష్ మూవీ), విజల్ (ఇంగ్లీష్ మూవీ), యంగ్ షెర్లాక్ (వెబ్ సిరీస్), అన్నగారు వస్తారు (తెలుగు మూవీ), ది స్ట్రేంజర్స్ చాప్టర్ 3, జాకీ (తమిళ మూవీ)
- నెట్ ఫ్లిక్స్ - వ్లాదిమిర్ (తెలుగు, హిందీ వెబ్ సిరీస్), వార్ మెషీన్ (ఇంగ్లీష్/తెలుగు మూవీ), ది డైనోసార్స్ (ఇంగ్లీష్/తెలుగు మూవీ), హలో బచ్చో (తెలుగు, హిందీ మూవీ), లవ్ లైక్ ఏ బైక్ (సిరీస్), స్మైల్ 2, రిమెంబర్ ది లాస్ట్ నైట్, స్ట్రీట్ ఫ్లో 3 సిరీస్, బాయ్ ఫ్రెండ్ ఆన్ డిమాండ్, స్టిల్ షైనింగ్, ది టిక్ టాక్ కిల్లర్, గర్ల్ ఫ్రమ్ నో వేర్ ద రీసెట్ (వెబ్ సిరీస్ - మార్చి 7)
- జియో హాట్ స్టార్ - విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు/హిందీ వెబ్ సిరీస్), టెడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
- ఆహా - అనగనగా ఆస్ట్రేలియాలో (తెలుగు మూవీ), ఓం శాంతి శాంతి శాంతిః
- సన్ నెక్స్ట్ - గ్రానీ (తమిళ మూవీ), డియర్ రాధీ (తమిళ మూవీ), ధీరమ్ (మలయాళం మూవీ)
- ఈటీవీ విన్ - ఎవ్రీ మంత్ ఇన్ సెక్యూర్ (తెలుగు మూవీ - మార్చి 8), చరిత కామాక్షి (తెలుగు మూవీ).
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















