Tirupati Deputy Mayor Election | తిరుపతి పీఠం కోసం కూటమి, వైసీపీ బాహా బాహీ | ABP Desam
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నగరంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. 50 డివిజన్లున్న తిరుపతిలో గత ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క కార్పొటేర్ మాత్రమే టీడీపీ ఉండగా..ప్రభుత్వం మారిన వెంటనే 20 మంది కార్పొరేటర్లు కూటమి వైపు అడుగులు వేశారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, వైసీపీ నుంచి వచ్చిన 20 కార్పొరేటర్లతో కలిసి డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరుకాగా...వైసీపీ కార్పొరేటర్లు ఎస్వీ యూనివర్సిటీ కి వచ్చే ప్పుడు మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్పొరేటర్లు వస్తున్న బస్సులను కూటమి నేతలు అడ్డుకున్నారు. అర్థరాత్రి టీడీపీ శిబిరానికి వచ్చి వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ వైసీపీ కార్పొరేటర్లను ఎన్నికకు వెళ్లకుండా నిలిపివేశారు. దీంతో కోరం లేని కారణంగా ఎన్నికను రేపటి వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి జేసీ శుభం బన్సల్ నిర్ణయం తీసుకున్నారు. వేంటకేశ్వర స్వామిని అవమానించిన వ్యక్తి తిరుపతి ప్రజలకు ఏం మేలు చేస్తారంటూ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఫైర్ అయ్యారు.





















