Tirumala News: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, శ్రీవారి భక్తులు షాక్
Andhra Pradesh News | తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం వివాదాస్పదమైంది. సిబ్బందిపైనే ఇంత దారుణమా, సామాన్యుల పరిస్థితి ఏంటని శ్రీవారి భక్తులు షాక్ అవుతున్నారు.

TTD Board Member | తిరుమల: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణానికి అంతా షాకయ్యారు. అది కూడా కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం ముందు టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్ బూతులతో రెచ్చిపోయాడు. శ్రీవారి ఆలయం ముందు మాకు ఇదేంటి అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుమల ఆలయం ప్రాంగణంలో టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్ అసభ్యకర పదజాలంతో ఇష్టరీతిన ప్రవర్తించడం వివాదాస్పదమవుతోంది.
మహాద్వారం గేటు నుంచి బయటకు పంపడం లేదని టీటీడీ ఉద్యోగి చెప్పడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడని తెలుస్తోంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్వు ఏమనుకుంటున్నావ్? థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు?' అంటూ నరేశ్ దూర్భాషలాడారు. నిబంధనలు ప్రకారం ఎవరైనా బయటికి వెళ్లాలన్నారు. దాంతో ఆవేశానికి లోనైన నరేష్ ఆగ్రహంతో "ఎవడ్రా నువ్వు బయటికి పోరా, థర్డ్ క్లాస్ నా XXXను ఫస్ట్ బయటికి పంపండంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. తిరుమలలో స్వామి వారి దర్శనభాగ్యం వచ్చే భక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన టీటీడీ సభ్యుడు, సిబ్బందిపై ఇంత దారుణంగా వ్యవహరించడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు.
తిరుమలను వీడని వావాదాలు..
కొన్ని నెలలుగా తిరుమలను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది కల్తీ నెయ్యి ఆరోపణలతో తిరుమలలో వివాదం మొదలైంది. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూ తయారుచేసి భక్తులు ప్రసాదాలు విక్రయించారని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. టీటీడీ అధికారులు స్పందించి నెయ్యి శాంపిల్స్ ను గుజరాత్ కు పంపి టెస్ట్ చేపించారు. కల్తీ నెయ్యిని లడ్డూల తయారీకి వినియోగించకుండా తిరిగి పంపించామని టీటీడీ చెప్పింది. ఆపై వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల జారీ కోసం క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు చనిపోవడం తెలిసిందే.
మరోవైపు కల్తీ నెయ్యి అంశంపై ఏర్పాటు చేసిన సిట్ అధికారులు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. సిట్ అధికారులు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కొందరు నిందితుల్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కోర్టు ఇచ్చిన పోలీస్ కస్టడీ ముగిసింది. విచారణలో తమకు సరిగా సహకరించడం లేదని, మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరనున్నారని తెలుస్తోంది.
Also Read: Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

