Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
Flood Relief To AP and Telangana | కేంద్ర ప్రభుత్వం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం ప్రకటించింది. అందులో అత్యధిక వాటా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించగా.. తెలంగాణకు రూ.231.75 కోట్లు ఇవ్వనుంది.

Union Govt approves Rs.1554.99 crore of assistance to 5 States | న్యూఢిల్లీ: గత ఏడాది సంభవించిన వరదలకు సంబంధించిన వరద సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ 5 రాష్ట్రాలకు రూ.1554.99 కోట్ల అదనపు సాయాన్ని ఆమోదించింది. 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల్లో సంభవించిన విపత్తులకుగానూ కేంద్రం ఆయా రాష్ట్రాలకు విపత్తు సాయంపై నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణలో ఆకస్మిక వరదలు రావడం సహా కొండ చరియలు విరిగి పడటం లాంటి ప్రకృతి విపత్తులు జరిగిన రాష్ట్రాలకు కలిపి నిధులు కేటాయించింది.
ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించారంటే..
2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం SDRFలో భాగంగా 27 రాష్ట్రాలకుగానూ రూ.18,322.80 కోట్లు విడుదల చేసింది. అదే విధంగా NDRF నుంచి 18 రాష్ట్రాలకు 4,808.30 కోట్లు కేంద్రం అందించింది. తాజాగా కేంద్రం అదనంగా కేటాయించిన మొత్తం రూ.1554.99 కోట్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.608.08 కోట్లు, రూ. తెలంగాణకు రూ.231.75 కోట్లు, త్రిపురకు రూ. 288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది పలు రాష్ట్రాల్లో విపత్తులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రాష్ట్రాల పరిస్థితిని పరిశీలిస్తోంది. ఈ క్రమంలో గత ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన 5 రాష్ట్రాల ప్రజలకు సహాయం చేయడానికి హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని కమిటీ నిధులు కేటాయించింది. గత ఏడాది కొండచరియలు విరిగిపడటం, వరదలు, ఆకస్మిక వరదలు, తుఫాను ప్రభావిత రాష్ట్రాలకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) కింద ఉన్నత స్థాయి కమిటీ రూ.1554.99 కోట్ల అదనపు నిధులు కేటాయిస్తూ వారికి శుభవార్త చెప్పింది.
షా నేతృత్వంలోని కమిటీ నిర్ణయం
అమిత్ షా నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ తాజాగా కేటాయించిన ఈ అదనపు సాయం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విడుదల చేసిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నిధుల కంటే ఎక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం SDRFలో భాగంగా 27 రాష్ట్రాలకు రూ. 18,322.80 కోట్లు ఇవ్వగా, NDRF కింద 18 రాష్ట్రాలకు రూ. 4,808.30 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నిధి (SDMF) నుంచి 14 రాష్ట్రాలకుగారూ రూ. 2208.55 కోట్లు, జాతీయ విపత్తు నిధి (NDMF) నుంచి 8 రాష్ట్రాలకుగానూ కేంద్రం ఇదివరకే రూ. 719.72 కోట్లు విడుదల చేయడం తెలిసిందే.
విపత్తులు సంభవించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు విపత్తు నష్టం అంచనాకు మంత్రులు, అధికారుల బృందాలను పంపి రిపోర్ట్ తెప్పించింది. ఆ వివరాలు పరిశీలించిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో సంభవించిన నష్టానికిగానూ అదనపు వరద సాయంపై ప్రకటన చేసింది. ఎన్డీఏ మిత్రపక్షాలలో ఏపీ, బిహార్ లకు అధిక వాటా కేటాయించారని తెలంగాణకు తక్కువ కేటాయించారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

