అన్వేషించండి
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభను పిఠాపురంలోని చిత్రాడలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున జనసైనికులు జనసేన సభకు చేరుకుంటున్నారు.
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
1/7

ప్రశ్నించే గొంతుక అని జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్ ఏపీలో అధికారంలో ఉన్న కూటమి సభ్యుడు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో నెగ్గిన అనంతరం జనసేన నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ కావడంతో పిఠాపురంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది.
2/7

జనసేన ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులు పార్టీ ఆవిర్భావ సభకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నాయి.
3/7

జనసేన అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగానూ ఉండటం పార్టీలో జోష్ నింపుతోంది. మరో ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ జనసేన నుంచి సేవలు అందిస్తున్నారు.
4/7

ఎటు చూసినా ఛలో పిఠాపురం అని పవన్ నియోజకవర్గం వైపు అడుగులు పడుతున్నాయి. పెద్ద సంఖ్యలో జనసేన నేతలు, కార్యకర్తలు, పవన్ అభిమానులు చిత్రాడకు చేరుకుంటున్నారు.
5/7

జనసేన పార్టీ నాయకులు పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవం సభకు హాజరయ్యే వారికోసం ఏర్పాట్లు చేశారు. పటిష్ట పోలీస్ బందోబస్తు సైతం ఏర్పాటు చేసిన నేతలు.. అంబులెన్సులు సైతం సిద్ధంగా ఉంచారు. అధికారంలోకి వచ్చాక చేస్తున్న తొలి ప్లీనరీ కావడం జనసైనికులను మరింత ఉత్సాహాన్నిస్తోంది.
6/7

రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న పార్టీ శ్రేణులకు సమీప ప్రాంతాలలో భోజన వసతి, మజ్జిగ, చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
7/7

పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జనసైనికులు పార్టీ సభకు విచ్చేసిన వారికి కడుపునిండా తిండి పెడుతున్నారు. ఎండలో వచ్చే వారు ఇబ్బంది పడకూడదని, వారు సురక్షితంగా తిరిగి వెళ్లాలని సూచించారు.
Published at : 14 Mar 2025 03:47 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















