అన్వేషించండి
Andhra Pradesh PTM: తల్లిదండ్రులకు పాదాభివందనం- విద్యార్థులతో కలిసి భోజనం, ఏపీలో సందడిగా పీటీఎం
Andhra Pradesh PTM: ఆంధ్రప్రదేశ్‌లో పీటీఎం సందడిగా సాగింది. ముఖ్మమంత్రిచంద్రబాబు నాయుడితోపాటు మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
తల్లిదండ్రులకు పాదాభివందనం- విద్యార్థులతో కలిసి భోజనం, ఏపీలో సందడిగా పీటీఎం
1/22

Andhra Pradesh Latest News: శ్రీ సత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో జరిగిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం 2.0 కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతావరణంలో కొనసాగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో కలిసి విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.
2/22

Andhra Pradesh PTM: ముందుగా జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాదాలకు మంత్రి నారా లోకేష్ నమస్కరించారు.
3/22

Andhra Pradesh PTM: నలుగురు పిల్లలకు తల్లికి వందనం పథకం కింద సాయం పొందిన పి.మాధవి, ఆమె నలుగురు పిల్లలు ముఖ్యమంత్రి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం పొందారు.
4/22

Andhra Pradesh PTM: తల్లల గొప్పదనంతో పాటు తల్లికి వందనం పథకం గురించి తెలియజేసేలా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వాల్స్‌ను ముఖ్యమంత్రితో కలిసి వీక్షించారు. ఫోటోలు దిగారు.
5/22

Andhra Pradesh PTM: ఎన్సీసీ క్యాడెట్స్ గౌరవ వందనం మధ్య జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా వారికి ఘనస్వాగతం పలికారు.
6/22

Andhra Pradesh PTM: జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పదో తరగతి విద్యార్థులతో ఇష్జాగోష్టి నిర్వహించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి మాట్లాడారు.
7/22

Andhra Pradesh PTM: విద్యార్థుల విద్యా ప్రగతి, అభిరుచి, ప్రవర్తన, ఆరోగ్యం హాజరు మొదలైన అంశాలతో కూడిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు.
8/22

Andhra Pradesh PTM: ఒకే కుటుంబానికి చెందిన పదో తరగతి ఏ సెక్షన్‌కు చెందిన పి.రిహాన్ బాషా, పి.జిగ్ను ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు.
9/22

Andhra Pradesh PTM: విద్యార్థుల మార్కులను అడిగి తెలుసుకున్నారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడారు.
10/22

Andhra Pradesh PTM: తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇంకా బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.
11/22

Andhra Pradesh PTM: స్కూల్‌కు గైర్హాజరైన విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులకు ఆగష్టు నుంచి మెసేజ్ రూపంలో తెలియజేయజేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.
12/22

Andhra Pradesh PTM: పదో తరగతి విద్యార్థులతో ఇష్టాగోష్టి అనంతరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని 8వ తరగతి బి సెక్షన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ చేరుకున్నారు.
13/22

Andhra Pradesh PTM: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు ‘వనరులు’ అనే సబ్జెక్ట్‌పై క్లాస్ చెప్పారు.
14/22

Andhra Pradesh PTM: చంద్రబాబు పాఠాలు చెప్పినప్పుు విద్యార్థిగా మారిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముందు బెంచీలో కూర్చొని పాఠాన్ని శ్రద్ధగా విన్నారు.
15/22

Andhra Pradesh PTM: మానవ వనరులు అంటే ఏమిటి, సహజ వనరులు, పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులపై విద్యార్థులకు ముఖ్యమంత్రి పాఠం బోధించారు.
16/22

Andhra Pradesh PTM: చంద్రబాబు విద్యార్థులకు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. సమాజంలో మార్పు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు.
17/22

Andhra Pradesh PTM: భవిష్యత్‌లో విద్యార్థులు ఏం కావాలనుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. పోలీస్, డాక్టర్, ఐఏఎస్, క్రికెట్ ప్లేయర్లు కావాలనుకునేవారు చేతులు పైకి ఎత్తాలని సూచించారు. వారంతా తమ లక్ష్యాన్ని చేతులు పైకి ఎత్తి చెప్పారు.
18/22

Andhra Pradesh PTM: విద్యార్థులకు ఆశయం ఉండాలని.. ఆశయ సాధన కోసం ఇప్పటి నుంచే కష్టపడి చదవాలని మార్గదర్శకం చేశారు. అందరికీ గుడ్ లక్.. ఆల్ ది బెస్ట్ చెప్పారు.
19/22

Andhra Pradesh PTM: రాజకీయ నాయకులు కావాలనుకునేవారు చేతులు ఎత్తాలని మంత్రి నారా లోకేష్ అడగ్గా.. ఎవరూ చేయి పైకి ఎత్తలేదంటూ నవ్వులు పూయించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. నారా లోకేష్ బాగా చదువుకున్నారు, మంత్రి అయ్యారు, తల్లికి వందనం అమలు చేశారు, పాఠశాలల్లో మార్పులు తీసుకువచ్చారంటూ ప్రశంసించారు.
20/22

Andhra Pradesh PTM: విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. మార్కులపై ఆరా తీశారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఫోటోలు దిగారు.
21/22

Andhra Pradesh PTM: పీటీఎం తర్వాత విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ అక్కడే భోజనం చేశారు.
22/22

Andhra Pradesh PTM: విద్యార్థులకు పెట్టిన ఫుడ్‌నే ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ తిన్నారు.
Published at : 10 Jul 2025 03:48 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















