అన్వేషించండి
Tirumala: కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ వైభోగం, దర్శించుకుంటే చాలు ఆకలిదప్పులుండవ్!
Chinna Sesha Vahana Seva: బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ గా దర్శనమిచ్చారు.
Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam.
1/9

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సెప్టెంబర్ 27 శనివారం ఉదయం మలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు.
2/9

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
3/9

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
4/9

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు.
5/9

ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. కానీ కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది.
6/9

కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించిన స్వామివారిని దర్శించుకుంటే ఆహారానికి లోటుండదని భక్తుల విశ్వాసం
7/9

నాలుగోరోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీవారు అభయం ఇస్తారు
8/9

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సందడి
9/9

వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.
Published at : 27 Sep 2025 12:51 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
రాజమండ్రి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















