అన్వేషించండి
Tirumala: మోహినీ అవతార దర్శనం మాయా మోహ నాశనం - సాయంత్రం గరుడవాహనంపై శ్రీమలయప్పస్వామి!
Tirumala Brahmotsavam: బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు శ్రీ మలయప్పస్వామి. సాయంత్రం గరుడవాహన సేవ జరగనుంది
Brahmotsavam Mohini Avataram
1/8

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామి మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు.
2/8

ఉదయం 8 గంటల నుంచి 10 వరకు మాడ వీధుల్లో విహరించిన స్వామివారు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
3/8

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
4/8

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
5/8

మోహినీ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో సందేశం ఇస్తున్నారు
6/8

సెప్టెంబర్ 28 ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు విశేషమైన గరుడవాహనంపై శ్రీమలయప్పస్వామివారు కటాక్షిస్తారు.
7/8

108 వైష్ణవ దివ్యదేశాలలో గరుడసేవకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.
8/8

గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం
Published at : 28 Sep 2025 02:09 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
బిగ్‌బాస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















