Telangana liquor shops closed: జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో నాలుగు రోజులు లిక్కర్ షాప్స్ బంద్ - పోలింగ్, కౌంటింగే కారణం
Jubilee Hills by-election: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల కారణంగా ఆ నియోజకవర్గ పరిధిలో నాలుగు రోజుల పాటు లిక్కర్ సేల్స్ బంద్ చేస్తున్నారు. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి 11 వరకు పూర్తి నిషేధం.

Jubilee Hills liquor shops closed:: జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా 'డ్రై డేస్' ప్రకటించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఆదేశాల మేరకు, నవంబర్ 9, 2025 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11, 2025 సాయంత్రం 6 గంటల వరకు, కౌంటింగ్ డే అయిన నవంబర్ 14, 2025 మొత్తం రోజు లిక్కర్ సేల్స్, సర్వీస్‌పై పూర్తి నిషేధం విధించారు. ఎన్నికల కమిషన్ (ECI) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల నియోజకవర్గంలోని వైన్ షాపులు, బార్లు, పబ్‌లు మూతపడనున్నాయి. ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు చేస్తారు.
ఉప ఎన్నికలు నవంబర్ 11న జరగబోతున్నాయి. ఓటింగ్ కు 48 గంటల ముందు నుంచి (సెక్షన్ 135C ప్రకారం) లిక్కర్ సేల్స్ ఆపాలని ECI ఆదేశాలు స్పష్టం చేశాయి. నవంబర్ 9, 2025 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11, 2025 ఎన్నికల రోజు సాయంత్రం 6 గంటల వరకు అమలవుతుంది. నవంబర్ 14, 2025 మొత్తం రోజు లిక్కర్ షాపులు తెరవకూడదు. ఇది ఫలితాలు ప్రకటించే రోజు, కాబట్టి టెన్షన్‌లు, అల్లర్లను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ బ్యాన్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మాత్రమే వర్తిస్తుంది, కానీ ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి మద్యం ట్రాన్స్‌పోర్ట్‌కు కూడా నిషేధం. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ టీములు, పోలీసులు రైడ్‌లు నిర్వహించి, అక్రమ పంపిణీని అరికడతాయి. ఇప్పటికే ఎన్నికల ముందు రైడ్‌లలో రూ. 34 కోట్ల విలువైన క్యాష్, లిక్వర్, డ్రగ్స్ సీజ్ చేశారు.
Dry Days Alert - Liquor Ban in Jubilee Hills constituency in view of Bye-Election
— Naveena (@TheNaveena) November 6, 2025
From: 6:00 PM, Nov 9, 2025
To: 6:00 PM, Nov 11, 2025
Also: Nov 14, 2025 (counting day) pic.twitter.com/rVkr2oFY7d
ఈ ఎన్నికలు హైదరాబాద్ పట్టణ రాజకీయాల్లో కీలకం. విజయం కోసం బీఆర్ఎస్, బీజేపీ , కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మద్యం అక్రమ రవాణాను ఆపడానికి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ 50 టీములను ఏర్పాటు చేసింది. ఉల్లంఘనలకు పాల్పడేవారికి ₹50,000 నుంచి ₹5 లక్షల వరకు జరిమానా, లైసెన్స్ రద్దు, చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
జూబ్లిహిల్స్ ఉపఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు అత్యంత కీలకంగా మారింది. విజయం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దీంతో మద్యం, డబ్బు వెల్లువలా పారుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ప్రచారం ముగిసిన రోజు నుంచి.. పోలింగ్ పూర్తయ్యే వరకు.. తర్వాత కౌంటింగ్ రోజున మద్యం బంద్ చేస్తున్నారు. అక్కడి ప్రజలు పక్క నియోజకవర్గానికి వెళ్లి తాగి రావొచ్చు కానీ.. మద్యం తెచ్చుకోకూడదు..





















