ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
దాదాపు 2 నెలల నుంచి భారత్‌కి ఆసియా కప్ ఇవ్వకుండా తిరుగుతున్న ట్రోపీ దొంగ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మొహిసిన్ నఖ్వి బీసీసీఐని ఎదుర్కొనే ధైర్యం లేక ఏకంగా ఐసీసీ మీటింగ్‌కే డుమ్మా కొట్టేశాడు. ఈ నెల 4వ తేదీ నుంచి దుబాయ్‌లో ICC Executive Board మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్‌కి అటెండ్ అయిన బీసీసీఐ రిప్రజెంటేటివ్స్.. మొహిసిన్ నక్విపై చాలా సీరియస్ ఆరోపణలు చేశారు. ఆసియా కప్ ఇవ్వకుండా కావాలని తప్పించుకు తిరుగుతున్నాడని, వెంటనే ట్రోఫీని భారత్‌కి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు.
దీంతో ఈ మీటింగ్‌కి అటెండ్ అయితే.. కచ్చితంగా బీసీసీఐని డైరెక్ట్‌గా ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే జరిగితే.. ఐసీసీ ముందు తన తప్పు బయపడుతుందనే భయంతో ఏకంగా మీటింగ్‌కే రాకుండా తప్పించుకోవాలని డిసైడ్ అయ్యాడట నఖ్వి. పాకిస్తాన్ మినిస్టర్‌గా కూడా ఉన్న నఖ్వి.. తమ దేశంలో రాజకీయ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటివల్లే సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని ఐసీసీకి మెయిల్ పంపారట.
దీంతో ఈ నెల 7వ తేదీన ఐసీసీ సమావేశానికి నఖ్వీ స్థానంలో పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ సయీద్ హాజరుకాబోతున్నారని, అయితే నఖ్వీ వీడియో కాల్ ద్వారా అటెండ్ అయ్యే ఛాన్స్‌లున్నాయని అంటున్నారు. ఇక ఈ విషయం తెలిసినప్పటి నుంచి.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నఖ్విని ఓ ఆట ఆడుకుంటున్నారు. సిగ్గులేకుండా మా ట్రోపీ దగ్గరపెట్టుకోవడమే కాకుండా.. కనీసం బీసీసీఐని ఎదుర్కొనే ధైర్యం కూడా లేని పిరికోడు నఖ్వి అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మీటింగ్‌లో బీసీసీఐ తన వాదనలు బలంగా వినిపిస్తుండటంతో.. త్వరలో ఐసీసీ భారత్‌కి ఫేవర్‌గా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. అదే జరిగితే.. ఈ మీటింగ్ ముగిసేటప్పటికి భారత్‌కి ట్రోపీ రావడంపై పక్కా క్లారిటీ వచ్చేస్తుంది.





















