TDP Counter to YSRCP: వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
TDP Vs YSRCP: వైఎస్ఆర్‌సీపీ ట్రూత్ బాంబ్ పేరుతో వేసిన ట్వీట్ కు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. సత్యవర్ధన్ ను వంశీ తీసుకెళ్తున్న దృశ్యాలు రిలీజ్ చేసింది.

Truth Bombs: టీడీపీ, వైసీపీ మధ్య ట్రూత్ బాంబుల హడావుడి సాగుతోంది. తెలుగుదేశం పార్టీ రియల్ ట్రూత్ బాంబ్ పేరుతో వైసీపీకి కౌంటర్ ఇచ్చింది. దళిత యువకుడు సత్యవర్ధన్ ను విజయవాడలో కిడ్నాప్ చేసారు. కిడ్నాప్ చేసిన కారులోనే కోర్టుకు తీసుకెళ్లి బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారు. తర్వాత హైదరాబాద్ లో ఉన్న వల్లభనేని ఇంటికి తీసుకెళ్లారు. ఇదిగో ఈ సీసీ ఫుటేజీ సాక్ష్యం. ఇప్పుడు చెప్పు జగన్ నీ అబద్దాలు అని టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్టు చేశారు.
💣 The Real Truth Bomb 💣 🔥🚒🧯🧨😂
— Telugu Desam Party (@JaiTDP) February 18, 2025
దళిత యువకుడు సత్యవర్ధన్ ను విజయవాడలో కిడ్నాప్ చేసారు. కిడ్నాప్ చేసిన కారులోనే కోర్టుకు తీసుకెళ్లి బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారు. తర్వాత హైదరాబాద్ లో ఉన్న వల్లభనేని ఇంటికి తీసుకెళ్లారు. ఇదిగో ఈ సీసీ ఫుటేజీ సాక్ష్యం. ఇప్పుడు చెప్పు జగన్ నీ… pic.twitter.com/IQTlrREbpy
అంతకు ముందు వైసీపీ ట్రూత్ బాంబు పేరుతో సత్యవర్థన్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలాన్ని పోస్టు చేసింది. వంశీపై తప్పుడు కేసులు పెట్టడానికే కుట్ర పన్నారని ఆరోపించింది.
💣 Truth Bomb 💣
— YSR Congress Party (@YSRCParty) February 18, 2025
వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు
- గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు
- కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్మెంటే అందుకు నిదర్శనం
- చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్థన్ ఫిబ్రవ… pic.twitter.com/H5hseJpSv0
వల్లబనేని వంశీ అరెస్టుపై ఏపీ రాజకీయాలు రగిలిపోతున్నాయి. వంశ ని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కాకుండా.. ఫిర్యాదు దారుడ్ని బెదిరించిన కేసులో అరెస్టు చేశారు. అయితే సత్యవర్ధన్ ను వంశీ బెదిరిచలేదని వైసీపీ అంటోంది. ఆయనంతకు ఆయన కేసు విత్ డ్రా చేసుకున్నారని....తాను కేసు పెడుతున్నట్లుగా తనకు తెలియదని సాక్షిగా సంతకం చేయించుకున్నారని ఆయన కోర్టులో చెప్పారు. అయితే ఇలా చెప్పించిది వంశీనేనని .. ఆయన కుటుంబాన్ని బెదిరించి, డబ్బులు ఇస్తామని ఆశ చూపి.. కిడ్నాప్ చేసి ఇలా చేయించారని పోలీసులు కేసులు పెట్టారు. అరెస్టు చేశారు.
సత్యవర్దన్ ను వంశీ తన ఇంట్లోకి తీసుకెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి . విజయవాడ కోర్టు ఆవరణకు కూడా ఆయన తీసుకు వచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో రెండు పార్టీలూ ట్రూత్ బాంబుల పేరుతో వీడియోలు.. డాక్యుమెంట్లు రిలీజ్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాజకీయ దుమారం అతంకతూ పెరుగుతోంది.
జగన్ హయాంలో దళితులపై 11 వేల 500కు పైగా దాడులు జరిగాయి. 188 మంది దళితులను హత్య చేసారు. 637 మంది దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయి. అయినా ఏ ఒక్క బాధిత కుటుంబాన్నీ జగన్ పరామర్శించలేదు. అలాంటిది దళిత యువకుడిని కిడ్నాప్ చేసి, హింసించిన వ్యక్తి కోసం జైలుకొచ్చాడు ఈ దళిత ద్రోహి జగన్.… pic.twitter.com/xVbpQyGhLp
— Telugu Desam Party (@JaiTDP) February 18, 2025
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

