Carrot-Beetroot Juice : ఉదయాన్నే బీట్రూట్, క్యారెజ్ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారా? నిపుణుల సలహాలు ఇవే
Weight Loss Drink : ఉదయాన్నే కొన్ని డ్రింక్స్ తాగితే బరువు తగ్గుతారంటారు. వాటిలోకి బీట్రూట్, క్యారెట్ జ్యూస్ కూడా చేరింది. ఇది ఎంతవరకు నిజం? నిపుణులు ఏమి చెప్తున్నారో చూసేద్దాం.

Benefits of Carrot-Beetroot Juice : బీట్రూట్, క్యారెట్ జ్యూస్‌ని చాలామంది ఉదయాన్నే తీసుకుంటారు. మరికొందరు ఏబీసీ అంటూ బీట్రూట్, క్యారెట్లతో యాపిల్ని కూడా కలిపి జ్యూస్ చేసుకుని తాగుతారు. ఇవి స్కిన్, హెయిర్‌కి మంచి ఫలితాలు ఇస్తాయని కూడా చెప్తారు. అయితే ఈ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుందట. బరువు తగ్గాలనుకునేవారు దీనిని తీసుకుంటే మంచి హెల్ప్ అవుతుందని అంటున్నారు. ఇంతకీ ఇది ఎంత వరకు నిజం. నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి? బరువు తగ్గడంలో ఈ జ్యూస్ ఎంతవరకు హెల్ప్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం.
పోషకాలతో నిండి ఉండిన ఈ బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తక్కువ కేలరీలతో అందుబాటులో ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల వ్యాయామ పనితీరు మెరుగవుతుంది. హెల్తీగా బరువును మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుందని.. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీనిని తమ డైట్లో చేర్చుకోవచ్చని అంటున్నారు. ఇది బరువు నిర్వహణలో ఎలా హెల్ప్ చేస్తుంది? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
లో కేలరీ జ్యూస్
బరువు తగ్గాలనుకునేవారు కేలరీలను కొలుస్తారు. కాబట్టి అలాంటివారు ఈ జ్యూస్‌ని తీసుకోవచ్చు. ఎందుకంటే క్యారెట్, బీట్రూట్ జ్యూస్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా విటిమిన్ ఎ, సి, కె, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు బరువు తగ్గడాన్ని ప్రోత్సాహిస్తాయి. యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ జ్యూస్ బరువు పెరగకుండా హెల్ప్ చేస్తుంది.
మెరుగైన జీవక్రియ
బరువు తగ్గడంలో మెటబాలీజం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ జ్యూస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు హెల్ప్ చేస్తుంది. గట్ను హెల్తీగా ఉంచుతుంది. మెటబాలీజంను పెంచుతుంది. జీవక్రియ మెరుగైతే.. కేలరీలు బర్న్ అవ్వడం సులభమవుతుంది. దీనివల్ల బరువు తగ్గడం ప్రక్రియ వేగవంతం అవుతుంది.
డీటాక్స్
శరీరాన్ని డీటాక్స్ చేయాలనుకున్నప్పుడు.. ఈ జ్యూస్ మంచి ఆప్షన్. ఇది కాలేయాన్ని డీటాక్స్ చేసి.. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్యలు దూరమవుతాయి. కొవ్వు నిల్వలను తగ్గించి.. పూర్తి కాలేయ ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మూత్రపిండాలు శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపడంలో మరింత హెల్ప్ చేస్తాయి. గట్ హెల్త్ మెరుగవుతుంది.
షుగర్ కంట్రోల్
రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి దీనిని తీసుకోవచ్చు. క్యారెట్లు తక్కువ గ్లెసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో అకస్మాత్తుగా స్పైక్ అయ్యే చక్కెరలను కంట్రోల్ చేస్తాయి. షుగర్ క్రాష్‌లు కాకుండా.. క్రేవింగ్స్ లేకుండా హెల్ప్ చేస్తుంది. ఈ క్రేవింగ్స్ కంట్రోల్ అయితే అన్ హెల్తీ ఫుడ్ జోలికి వెళ్లరు. దీనివల్ల బరువు కంట్రోల్ అవుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు
బీట్రూట్ క్యారెట్ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. వీటిలో బీటా కెరోటిన్, బీటాలైన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించి.. పూర్తి ఆరోగ్యానికి మద్దతునిస్తాయి. బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.
గుర్తించుకోవాల్సిన విషయాలు
ఈ జ్యూస్‌లో సహజమైన షుగర్స్ ఉంటాయి. కాబట్టి దీనిని మితంగా తీసుకుంటే మంచిది. బీట్రూట్, క్యారెట్ జ్యూస్‌తో పాటు పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, మిల్లెట్స్‌తో కూడిన బ్యాలెన్స్డ్ డైట్లో తీసుకోవాలి. వ్యాయామంతో పాటు ఫుడ్ కంట్రోల్ చేయాలి. ఈ జ్యూస్‌ని రోజూ తీసుకోవాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. అన్నింటికంటే గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ జ్యూస్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది కానీ.. పూర్తిగా బరువు తగ్గడానికి కాదు. ఒక్క జ్యూస్‌తో లేదా ఆహారంతో బరువు తగ్గడమనేది అసాధ్యం. అలా చేయడం హెల్తీ పద్ధతి కూడా కాదు. కాబట్టి బరువును తగ్గడాన్ని వేగవంతం చేసే వాటిలో భాగంగానే దీనిని చూడాలి అంటున్నారు నిపుణులు.
Also Read : ఉదయాన్నే నిమ్మరసాన్ని నల్ల ఉప్పుతో కలిపి తీసుకుంటే ఎన్నో లాభాలు.. ముఖ్యంగా సమ్మర్లో మరీ మంచిదట, ఎందుకంటే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

