JC Prabhakar reddy vs Kethireddy peddareddy | తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం | ABP Desam
తాడిపత్రి నియోజకవర్గం లో మళ్లీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రికి వస్తున్నారనే సమాచారంతో హింసాత్మక ఘటనలు జరగొచ్చని భావించిన పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలతో తాడిపత్రి నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని బయటకు పంపించేశారు పోలీసులు తిరిగి తాడిపత్రిలోకి అనుమతించలేదు. ఇదే విషయంపై కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు. కండిషన్ బెయిల్ కూడా పూర్తి అవడంతో తాడిపత్రి కి వెళ్తున్నానంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించడంతో ఇప్పుడు తాడిపత్రిలో హై టెన్షన్ సిచ్యుయేషన్ ఏర్పడింది. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అడ్డుకుంటామని జేసీ వర్గీయులు చెప్పటంతో...తాడిపత్రిలో పోలీసులు మోహరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఊరు తిమ్మంపల్లి కి చేరుకున్న పోలీసులు పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. శాంతిభద్రత దృష్య్టా తాడిపత్రికి వెళ్లొద్దంటూ 41ఏ నోటీసులు అందించారు. తాడిపత్రికి పోలీసు అదనపు బలాగులు చేరుకున్నాయి. తాడిపత్రి జూనియర్ కాలేజీ మైదానాన్ని కంట్రోల్ సెంటర్ గా మార్చుకుని అక్కడి నుంచి పోలీసులు డ్రోన్లతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి ఇళ్లు, పరిసర ప్రాంతాలను డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు.





















